Oats For Breakfast: ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్లు కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతోపాటు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజు ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల గుండె

Oats For Breakfast: ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
Oats For Breakfast

Updated on: May 11, 2025 | 1:07 PM

ఇటీవల కాలంలో ఓట్స్‌ వాడకం బాగా పెరిగింది. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ని ఎక్కువగా తింటున్నారు. పైగా పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా ఓట్స్‌ మంచివని చెబుతున్నారు. ఓట్స్‌లో ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ బీ6, మెగ్నీషియం, కాల్షియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఓట్స్‌ని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా చాలా మంది ఫాలో అవుతున్నారు. అయితే, మంచివని ఓట్స్‌ని రోజూ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఓట్స్ లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫోలేట్, విటమిన్ బి 1, విటమిన్ బి 5 వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్లు కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతోపాటు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజు ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.

ఓట్స్‌లోని కరిగే ఫైబర్లు రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. కరిగే, కరగని ఫైబర్లు ఓట్స్‌లో ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఓట్స్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా ఓట్స్ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌లో సపోనిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలైన ఎక్జిమా, సోరియాసిస్ వంటి వాటిని దూరం చేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..