Anti aging drinks: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా..?అయితే, వీటిని రోజూ తాగితే మెరిసిపోతారు..
వృద్ధాప్యచాయలు మీ దరిచేరకుండా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారం, జీవనశైలి అలవాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే యాంటీ ఏజీయింగ్ ప్రక్రియ వేగవంతమౌతుంది. అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. కొన్ని రకాల పానీయాలు, జ్యూస్‌లు తాగితే వృద్ధాప్య ఛాయలు తొలగిపోయి..నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నేటి బిజీ లైఫ్‌స్టైల్, అస్తవ్యస్థమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటివి ప్రజల్ని ఎక్కువగా వేధిస్తున్నాయి. ఇవన్నింటి ఫలితంగా చాలా మంది చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపించేలా చేస్తున్నాయి. శరీరంలో న్యూట్రియంట్స్ లోపం, కాలుష్యం కారణంగా తక్కువ వయస్సులోనే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. దాంతో కొందరు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. కానీ, వయసు పైబడిన సరే.. వృద్ధాప్యచాయలు మీ దరిచేరకుండా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారం, జీవనశైలి అలవాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే యాంటీ ఏజీయింగ్ ప్రక్రియ వేగవంతమౌతుంది. అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. కొన్ని రకాల పానీయాలు, జ్యూస్‌లు తాగితే వృద్ధాప్య ఛాయలు తొలగిపోయి..నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గ్రీన్ టీ.. యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ.. చర్మంలో ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఎల్ థయమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫినాల్స్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా, సులభంగా బరువు తగ్గొచ్చు. గ్రీన్‌టీలోని కెటాచిన్లు చెడు కొవ్వును కరిగిస్తాయి. గ్రీన్ టీ తాగితే కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.
బీట్రూట్ జ్యూస్.. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన బీట్రూట్ జ్యూస్ తాగడం చర్మ ఆరోగ్యానికి మంచిది. బీట్‌రూట్‌లో బీటాసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగిస్తుంది. బీట్రూట్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
దానిమ్మ జ్యూస్.. దానిమ్మలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, పోలీఫెనోల్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి ఊహించని లాభాలను అందిస్తుంది.. అంతేకాకుండా దానిమ్మతో క్యాన్సర్ నుంచి రక్షించుకోవచ్చు. అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.
పసుపు పాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు పాలు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు.. పాలలోని గుణాలు షుగర్ ఉన్నవారికి ఇమ్యూనిటీని పెంచుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, మెదడు షార్ప్‌గా మారుతుంది. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. మంచి నిద్రకు దారి తీస్తుంది. కాల్షియం, విటిమిన్ డి అందుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఫలితంగా చక్కటి ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం అవుతుంది.
నిమ్మరసం ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యానికే కాదు చర్మానికీ ఇది మెరుపుని ఇస్తుంది. విటమిన్ సి కలిగిన నిమ్మరసం నీళ్లు కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుతుంది. కాబట్టి మీ మేని ఛాయ మెరిసిపించుకోవడానికి నిమ్మకాయ రసం ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోవాలి.
క్యారెట్ జ్యూస్ విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన క్యారెట్ జ్యూస్ తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ల్యూటిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల మెదడుకు మంచి ఆరోగ్యం. క్యారట్‌లో ఉన్న బీటా కెరోటిన్ చాలా ఉపయోగకరం. క్రమం తప్పకుండా క్యారట్ జ్యూస్ తీసుకుంటే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది. చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. వాతావరణం కారణంగా చర్మం డ్యామేజ్ అవ్వడాన్ని కూడా నివారిస్తుంది. స్కిన్ టోన్, నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మం మీద గీతలు, ముడతలు తగుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..