AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. అరటిపండ్లు అతిగా తింటున్నారా..! అయితే డేంజరేనట..

అరటి పండులో విటమిన్ బి6 ఉంటుంది. దీంతో.. అరటి పండును ఎక్కువగా తినడం వల్ల శరీరానికి విటమిన్ బి6 అందుతుంది. అయితే, విటమిన్ బి6 ఎక్కువైతే.. నరాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.. నరాల బలహీనత, తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

అమ్మబాబోయ్.. అరటిపండ్లు అతిగా తింటున్నారా..! అయితే డేంజరేనట..
Banana
Follow us
Jyothi Gadda

|

Updated on: May 11, 2025 | 12:45 PM

అరటి పండు.. దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అరటి పండు రుచి తియ్యగా ఉంటుంది. సీజన్‌తో పనిలేదు.. అన్ని కాలల్లో అరటి పండు అందుబాటులో ఉంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అరటి పండును ఆస్వాదిస్తారు. రుచిలో మాత్రమే కాదు..అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అరటి పండును పేదవాడి యాపిల్‌ అని, పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే, పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అరటి పండ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు అతిగా తినటం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అరటిపండ్లలో సహజంగానే ఫ్రక్టోజ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువ అవుతాయి. దీంతో.. గుండె, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో.. గుండె, కిడ్నీల సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. అరటిపండ్లలో చక్కెర ఎక్కువ. అతిగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అరటిపండ్లు ఎక్కువగా తింటే సైనస్ సమస్య పెరుగుతుంది. జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది.

అరటిపండ్లు ఎక్కువగా తింటే తలనొప్పి వస్తుంది. ఇప్పటికే తలనొప్పి ఉంటే అరటిపండ్లు తినకండి. అరటిపండ్లలో ప్రోటీన్ ఉండదు. అతిగా తింటే కండరాలు బలహీనపడతాయి. అరటి పండులో విటమిన్ బి6 ఉంటుంది. దీంతో.. అరటి పండును ఎక్కువగా తినడం వల్ల శరీరానికి విటమిన్ బి6 అందుతుంది. అయితే, విటమిన్ బి6 ఎక్కువైతే.. నరాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.. నరాల బలహీనత, తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!