మారుతున్న కాలంతో పాటు ఆహారం తినే విధానం, వండుకునే విధానం కూడా మారుతోంది. గతంలో మట్టి పాత్రల్లోనో, ఇత్తడి గిన్నెల్లోనో ఆహారం వండేవారు. ఇప్పుడు వాటి స్థానంలో నాన్ స్టిక్ పాత్రలు వచ్చాయి. ప్రస్తుతం నాన్-స్టిక్ పాత్రలతో రకరకాల ఆహారాన్ని వండే ట్రెండ్ ఉంది. దాదాపు అందరి ఇళ్లలోనూ నాన్ స్టిక్ పాత్రలు తప్పకుండా కనిపిస్తాయి. ఈ పాత్రల ప్రత్యేకత ఏమిటంటే, ఆహారం వాటికి పాత్రలకు అంటుకోకుండా, తక్కువ నూనెతో ఆహారాన్ని వండుకోవచ్చు. ముఖ్యంగా నాన్-స్టిక్ పాత్రలను తక్కువ నూనేతోనే వంట చేయవచ్చు అనే ఆలోచనతోనే ఉపయోగిస్తున్నారు. అయితే నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా ఉపయోగించే వారికి హెచ్చరిక ను జారీ చేసింది ICMR. ఈ రోజు నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేయడంపై ICMR నివేదిక ఏమి చెబుతుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పలు అంశాలపై ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఆహారం, పానీయాలకు సంబంధించిన అనేక సమాచారాన్ని పొందుపరిచింది. ఈ మార్గదర్శకాల్లో నాన్-స్టిక్ పాత్రలలో వంట చేయడానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వబడింది. ICMR మార్గదర్శకాల ప్రకారం నాన్-స్టిక్ పాత్రలలో ఆహారాన్ని వండడం ఎంతవరకు సరైనదో చూద్దాం..
నాన్-స్టిక్ పాత్రలలో ఆహారాన్ని వండటం ఇల్లాలకు చాలా సులభం. తక్కువ సమయంలో తక్కువ నూనేతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడానికి నాన్-స్టిక్ పాత్రలు అనుకూలమైనవి. అయితే ఇలా చేయడం ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదు. నాన్-స్టిక్ పాత్రలు హానికరమైన రసాయనాలతో పూత పూయబడతాయి. ఈ పాత్రలను వేడి చేసే సమయంలో వాటి నుండి విషపూరితమైన పొగ వస్తుంది. అందువల్ల ఈ పాత్రలు ఆరోగ్య దృక్కోణం నుంచి చూస్తే అస్సలు మంచివిగా పరిగణించబడవు. ఈ పాత్రల్లోని వంట చేసిన ఆహారాన్ని తినడం వలన థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ సమస్యల బారిన పడవచ్చు. అయితే కొంతలో కొంత ప్రమాదాన్ని నివారించాలంటే.. నాన్ స్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వండేటప్పుడు మంట తక్కువగా ఉండేలా చూసుకోవడం, పాత్రకు పూత సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ICMR నివేదిక ప్రకారం మట్టి పాత్రలలో ఆహారాన్ని వండడం ఉత్తమం. మట్టి కుండలలో ఆహారాన్ని వండడమే కాకుండా వాటిలో ఆహారాన్ని నిల్వ చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆహారంలోని పోషకాలను, రుచిని రెండిటినీ మట్టి పాత్రలలో వంట చేసినా, నిల్వ చేసినా రెట్టింపు అవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ICMR మార్గదర్శకాలను పాటించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..