No Sugar Diet Tips: షుగర్ వ్యాధిగ్రస్తులు ఏం తినాలో.. ఏం తినకూడదో తెలియట్లేదా?
నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ నుంచి షుగర్ వరకు పలు రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇక ఊబకాయం నుంచి క్యాన్సర్ వరకు వచ్చే వ్యాధులన్నింటికీ చక్కెర ప్రధాన కారణం అవుతుంది. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు అలాగే తీపి ఆహారాలు శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ దీని కారణంగానే వస్తున్నాయి. అందుకే ఈ రోజుల్లో..

నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ నుంచి షుగర్ వరకు పలు రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇక ఊబకాయం నుంచి క్యాన్సర్ వరకు వచ్చే వ్యాధులన్నింటికీ చక్కెర ప్రధాన కారణం అవుతుంది. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు అలాగే తీపి ఆహారాలు శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ దీని కారణంగానే వస్తున్నాయి. అందుకే ఈ రోజుల్లో ‘నో షుగర్ డైట్’ అనేది జనాల్లో బాగా పాపులర్ అయింది. అయితే కేవలం రాత్రి భోజనంలో స్వీట్లు తినడం, టీలో పంచదార కలపడం మానేస్తే సరిపోదు. అలాగని చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేసినా కూడా ప్రమాదమే. ‘నో షుగర్ డైట్’ నివారించేందుకు కొన్ని ఆహార నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
చక్కెరను కలపవద్దు
టీ-కాఫీలలో చక్కెరను జోడించడం పూర్తిగా మానుకోవాలి. అలాగే ఇంట్లో తయారు చేసే హల్వా, ఫ్రైస్ లలో కూడా చక్కెర వినియోగించకూడదు. పండ్ల రసాల్లోనూ పంచదార కలపకూడదు. చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి.
డెజర్ట్‌లు
కుకీలు, కేకులు, పేస్ట్రీలు, ఐస్‌క్రీములు, క్యాండీలతోపాటు స్వీట్లు వంటి డెజర్ట్‌లకు దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాల తయారీలో చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి వాటిని పూర్తిగా తినడం మానుకోవాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్
టొమాటో సాస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లోనూ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, ఫ్రోజెన్ ఫుడ్స్‌లో కూడా చక్కెర ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి. ‘చక్కెర లేని ఆహారం’ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకూడదు. అలాగే వైట్ బ్రెడ్ తినకూడదు. దీంట్లో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
ప్రోటీన్
చికెన్, చేపలు, పప్పులు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచి, పని చేసే శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడానికి ఈ పోషకాలు చాలా అవసరం.
తృణధాన్యాలు
క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్, వోట్మీల్ వంటి ఆహారాలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. బరువు తగ్గడానికి, మంచి జీర్ణక్రియకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.
డ్రై ఫ్రూట్స్
వాల్‌నట్‌లు, బాదం, చియా గింజలు, అవిసె గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెరలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ కూడా సరిగ్గా ఉంటుంది.
కూరగాయలు
తాజా కూరగాయల్లో విటమిన్ ఎ, సి, కె, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి అవి బరువును తగ్గించడంలో, శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడంలో సహాయపడతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.