Morning Breakfast: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను లైట్‌ తీసుకుంటున్నారా.? మంచిదో.. కాదో.. తెలుసుకోండి.!

|

May 25, 2021 | 10:43 AM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది యువత ఉద్యోగ హడావుడి, ఇతరత్రా పనులు వెరిసి అలసత్వంతో ఉదయం టిఫిన్‌ను లైట్ తీసుకుంటూ..

Morning Breakfast: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను లైట్‌ తీసుకుంటున్నారా.? మంచిదో.. కాదో.. తెలుసుకోండి.!
Follow us on

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది యువత ఉద్యోగ హడావుడి, ఇతరత్రా పనులు వెరిసి అలసత్వంతో ఉదయం టిఫిన్‌ను లైట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే రాత్రి వేళల్లో అనుకున్న సమయం కంటే లేట్‌గా డిన్నర్ చేయడం అలవాటుగా మారింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్.. ఇలా చాలామంది చాలా రకాలుగా తమకు నచ్చిన వాటిని ఉదయాన్నే టిఫిన్‌గా తింటుంటారు. అయితే పనుల హడావుడి, లేట్ నైట్ నిద్రపోవడం వల్ల అలసత్వం ఏర్పడి చాలామంది చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గోడుతూ ఉంటారు. అలాగే రాత్రిగా ఆలస్యంగా కూడా డిన్నర్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.

ఇలా రెండు పూట్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దాదాపు 60 ఏళ్ళ వయసు ఉన్న 113 మంది హార్ట్ పేషెంట్స్‌ను పరీక్షించి.. ఈ విషయాన్ని తేల్చారు. ఎన్ని పనులు ఉన్నా.. బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌ను నిర్లక్ష్యం చేయకూడదని.. సరైన సమయానికి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాగా, పాలు, చపాతీ, బ్రెడ్, పండ్లు లాంటి వాటిని ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!