Nail Cutter: నెయిల్‌ కట్టర్‌లో ఈ రెండు బ్లేడ్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా..?

మన నిత్య జీవితంలో ఎన్నో వస్తువులను వాడుతుంటాము. కానీ కొన్ని వస్తువుల గురించి పెద్దగా తెలిసి ఉండదు. వాటిని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రతిదానికి ఓ అర్థం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మనిషి రెగ్యులర్‌గా ఉపయోగించే వస్తువులలో నెయిల్..

Nail Cutter: నెయిల్‌ కట్టర్‌లో ఈ రెండు బ్లేడ్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా..?
Nail Cutter

Updated on: May 15, 2023 | 7:06 PM

మన నిత్య జీవితంలో ఎన్నో వస్తువులను వాడుతుంటాము. కానీ కొన్ని వస్తువుల గురించి పెద్దగా తెలిసి ఉండదు. వాటిని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రతిదానికి ఓ అర్థం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మనిషి రెగ్యులర్‌గా ఉపయోగించే వస్తువులలో నెయిల్ కట్టర్ కూడా ఒకటి. గోర్లు పెరిగిన ప్రతిసారి కూడా ఇక నెయిల్ కట్టర్‌ సహాయంతో కత్తిరించుకుంటారు. తమకు నచ్చిన విధంగా గోర్లను షేప్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ నెయిల్ కట్టర్ తప్పకుండా ఉంటుంది. సాధారణంగా చాలా మంది వాడుతుంటారు. అయితే నెయిల్‌ కట్టర్‌లో రెండు కత్తిలాంటి పరికరాలు ఉంటాయి. ఇవి అందరికి తెలుసే. కానీ వాటి ఉపయోగం ఏంటనేది చాలా మందికి తెలియదు. దీంతో గోర్లను కత్తిరించడమే కాకుండా.. ఇతర పనులకు ఉపయోగించవచ్చు. చాలా మంది నెయిల్‌ కట్టర్‌లో ఉండే కత్తులు మన గోళ్లను శుభ్రం చేసుకోవడానికి ఉంటాయని అనుకుంటారు. కానీ అది తప్పు. అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి..? వాస్తవానికి రెండు బ్లేడ్ లను జోడించిన తరువాత నెయిల్ కట్టర్ యుటిలిటీ చాలా పెరిగింది.

మీరు బయటికి వెళ్లినప్పుడు బాటిల్ క్యాప్ తెరవాలంటే నెయిల్ కట్టర్ ఉపయోగించండి. నెయిల్ కట్టర్‌లో చిన్న వంగిన కత్తి లాంటిది ఉంటుంది. దాని సహాయంతో బాటిల్ క్యాప్ తీయవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా పర్యటనలో ఉన్నప్పుడు చిన్న కత్తి నిమ్మకాయలు, నారింజ ఇలాంటివి కత్తిరించేందుకు సులభంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కొందరూ గోర్లలో ఉన్న మురికిని శుభ్రం చేయడానికి కత్తుల పదునైన చివరలను ఉపయోగిస్తారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా చేయడంలో పొరపాటున ఆ పదునైన అంచులు మీ వేలికి గుచ్చుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల మీకు గాయం కూడా కావచ్చు. అందుకు జాగ్రత్తగా ఉండటం మంది. సో.. నెయిల్‌ కట్టర్‌లో ఉండే రెండు కత్తులు ఇలా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.