Heart: ఎక్కువ వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా.? నిపుణులు ఏమంటున్నారంటే
ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం, మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయి. యువత కూడా గుండె పోటుతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండే యువత కూడా ఇలా గుండె పోటు...
ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం, మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయి. యువత కూడా గుండె పోటుతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండే యువత కూడా ఇలా గుండె పోటు బారిన పడుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మనలో చాలా మందికి వ్యాయామం చేయడం వల్ల గుండె పోటు రాదనే భావన ఉంటుంది. అలాగే గుండె పోటు నుంచి కోలుకున్న వారు వ్యాయామం చేయొద్దనే అపోహ కూడా ఉంటుంది. అసలు ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటు నుంచి కోలుకున్న వారు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదనే ఓ భావన చాలా మందిలో ఉంది. అయితే ఇందులో నిజంగానే కొంతమేర నిజం ఉంది. గుండెపోటు నుంచి కోలుకున్న వారు బలమైన వ్యాయామాల జోలికి వెళ్లకపోడమే మంచిది. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ విపరీతమైన బరువులు ఎత్తడం, ఎక్కువగా జాగింగ్, వాకింగ్ వంటివి చేయడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది, గుండెపోటు అస్సలు రాదనే భావనలో కూడా చాలా మంది ఉంటారు. అయితే ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. శరీర అవసరానికి, సామర్థ్యానికి తగ్గట్టుగానే వర్కవుట్ లేదా ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి ఎక్కువ వ్యాయామాలు చేస్తే కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని అంటున్నారు. ఇది గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.
ఇక శరీరం ఫిట్‌గా ఉండడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే శారీరకంగా దృఢంగా ఉండటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందనడంలో నిజం ఉన్నా.. కుటంబ చరిత్రలో గుండెపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు ఉన్న వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజూ వ్యాయామం చేస్తే గుండె పోటు రాదనడంలో కూడా నిజం లేదు. రోజు వ్యాయామం చేసినా, సరైన జీవనశైలి లేకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..