Eyes: లేజర్‌ ట్రీట్మెంట్ అవసరమే లేదు.. ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌..

|

Sep 05, 2024 | 12:11 PM

దీంతో చాలా మంది లేజర్‌ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అయితే ఇది భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం. లేజర్‌ ట్రీట్మెంట్‌ చేయించుకోవడం ద్వారా కళ్లద్దాలకు దూరంగా ఉండొచ్చు. అయితే ఇదేది లేకుండా సింపుల్‌గా ఐ డ్రాప్స్‌ ద్వారా సైట్‌కు చెక్‌ పెడితే భలే ఉంటుంది కదూ! ఐడ్రాప్స్‌తో కళ్లజోడ్లకు చెక్‌ పెట్టడం అసాధ్యమని అనుకుంటున్నారా.?

Eyes: లేజర్‌ ట్రీట్మెంట్ అవసరమే లేదు.. ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌..
Eye Drop
Follow us on

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కళ్లద్దాలు ధరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా పదేళ్ల లోపు చిన్నారులు కూడా కళ్లజోడ్లు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక ఒక్కసారి కళ్లద్దాలు వస్తే జీవితాంతం ఉపయోగించాల్సిందే. ఒకవేళ మానేస్తే సైట్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే నచ్చకపోయినా కళ్లద్దాలు ఉపయోగిస్తుంటారు.

దీంతో చాలా మంది లేజర్‌ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అయితే ఇది భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం. లేజర్‌ ట్రీట్మెంట్‌ చేయించుకోవడం ద్వారా కళ్లద్దాలకు దూరంగా ఉండొచ్చు. అయితే ఇదేది లేకుండా సింపుల్‌గా ఐ డ్రాప్స్‌ ద్వారా సైట్‌కు చెక్‌ పెడితే భలే ఉంటుంది కదూ! ఐడ్రాప్స్‌తో కళ్లజోడ్లకు చెక్‌ పెట్టడం అసాధ్యమని అనుకుంటున్నారా.? అయితే త్వరలోనే ఇది నిజం కానుంది. ముంబయికి చెందిన ఓ ఫార్మా కంపెనీ కొత్తరకం ఐ డ్రాప్‌ను తయారు చేస్తోంది.

ముంబయికి చెందిన ఎన్టాడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు మందగించే సమస్య (ప్రెస్బియోపియా) బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 109 నుంచి 180 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 40 -45 ఏళ్ల వయసులో ఈ సమస్య మొదలై, 60 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి తీవ్రమవుతుంది.

దీంతో దగ్గరి వస్తువులు సరిగ్గా కనిపించవు. ఏదైనా చదవాలంటే కళ్లద్దాలు తప్పనిసరి అవుతుంది. ఈ సమస్యకు చికిత్స చేసేందుకు ‘ప్రెస్‌వు ఐ డ్రాప్స్‌’ను ఎన్టాడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ అభివృద్ధి చేసింది. ఈ ఐ డ్రాప్స్‌ ఉపయోగించడం వల్ల ప్రెస్బియోపియా బాధితులకు కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఎన్టాడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ తెలిపింది. అలా అని ఈ ధర మరీ ఎక్కువగా ఉంటుందని అనుకుంటే పొరబడినట్లే. కేవలం రూ. 350 ఉండొచ్చని తెలుస్తోంది. అక్టోబర్‌ మొదటి వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..