Heart Health: మార్నింగ్ వాకింగ్ చేస్తే గుండె పోటు వచ్చే చాన్స్..ఆ రోగులు ప్లీజ్ అలర్ట్

| Edited By: Anil kumar poka

Jan 06, 2023 | 5:32 PM

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల లోపు గుండె పోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఎపినెఫ్రిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, కార్టిసాల్ వంటి కొన్ని హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఇది ఆక్సిజన్ డిమాండ్, రక్తపోటు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే ఎండోథెలియల్ ప్రొజెనిటర్ కణాల స్థాయి తగ్గడం కూడా గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

Heart Health: మార్నింగ్ వాకింగ్ చేస్తే గుండె పోటు వచ్చే చాన్స్..ఆ రోగులు ప్లీజ్ అలర్ట్
Early Morning Walk
Follow us on

మనం చాలా సార్లు టీవీల్లో, పేపర్లలో ఉదయాన్నే గుండె పోటుతో ప్రముఖులు మరణించారని చూస్తుంటాం. మీకు ఎప్పుడైనా అసలు గుండె పోటు ఉదయం సమయంలోనే ఎందుకొస్తుంది అనే అనుమానం వచ్చిందా? పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల లోపు గుండె పోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఎపినెఫ్రిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, కార్టిసాల్ వంటి కొన్ని హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఇది ఆక్సిజన్ డిమాండ్, రక్తపోటు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే ఎండోథెలియల్ ప్రొజెనిటర్ కణాల స్థాయి తగ్గడం కూడా గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది. శీతాకాలపు ఉదయాలు గుండెపోటు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి, ఎందుకంటే ఉదయాన్నే చలి అధిక ప్రమాదం ఉన్న వ్యక్తుల గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  

మార్నింగ్ వాక్ వెళ్తే..

హార్ట్ పేషెంట్స్, అలాగే రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే వాకింగ్ చేయడం రిస్క్ అని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో శరీరం వేడిని కాపాడుకోవడం కోసం జీవక్రియను పెంచడానికి ప్రయత్నిస్తోంది. దీంతో శరీరం హైపర్యాక్టివ్ మూమెంట్‌లో ఉంది. ఈ సమయంలో వామ్ అప్ లేకుండా వ్యాయామం చేస్తే గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శీతాకాలపు ఉదయాలు హృదయనాళ పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతాయి. చలి వాతావరణం సహజంగా ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా, మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే బలహీనమైన గుండె ఉన్నవారికి  పంప్ చేయడానికి మరింత రక్తం అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో వారు హార్ట్ ఎటాక్ కు గురయ్యే అవకాశం ఉంది. 

కాలుష్యం, పొగ మంచుతో మరింత నష్టం

ప్రస్తుతం బయట కాలుష్యం చాలా మేరకు ఉంది. ఇదే సమయంలో చలికాలంలో పొగమంచు కూడా ఉంటుంది. దీంతో ఈ రెండు ఉన్న ఉదయం సమయంలో వాకింగ్ వెళ్తే మనం పీల్చే గాలి ఊపిరితిత్తులపై అదనపు భారాన్ని వేస్తుంది. సహజంగా ఊపిరితిత్తులు భారంగా పని చేస్తే అది గుండెపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి చలి కాలం ఉదయం సమయంలో ఉబ్బసం, క్రానిక్ బ్రొన్కైటిస్, ధూమ పానం చేసే వారు, హుద్రోగులు వాకింగ్ వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ఏ సమయంలో వాకింగ్ చేయాలి

చలికాలంలో వ్యాయామం ముఖ్యమైనప్పటి హార్ట్ పేషెంట్స్ ఉదయం వాకింగ్ వెళ్లడం ప్రమాదమని గుర్తుంచుకోవాలి.  ఉదయం ఎండ వచ్చాక కొద్ది దూరం మాత్రమే వాకింగ్ వెళ్లాలి. సూర్యాస్తమయ సమయంలోనైనా వాకింగ్ చేయవచ్చు. ముఖ్యంగా ఇంటి వద్ద ఉండి చేసే వ్యాయామానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. అలాగే వాకింగ్ లేదా వ్యాయామం చేసే సమయంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

శీతాకాలంలో గుండెపోటు నుంచి రక్షణకు మార్గాలు

  • మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి
  • చలి నేపథ్యంలో కచ్చితంగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చాలా తక్కువ ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా మార్నింగ్ వాకింగ్ కు వెళ్లకూడదు. 
  • ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీస్, హెల్తీ డైట్‌ని నిర్వహించాలి. ఇది బీపీను నివారిస్తుంది. 
  • ఎక్కువ శ్రమ వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 
  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న కొవ్వు, వేయించిన, తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. 

మరిన్ని హెల్త్  టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..