ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం వెల్లుల్లి రెబ్బలు బెస్ట్ రెమిడీ.. ఎలా తినాలంటే

|

Jul 29, 2024 | 12:39 PM

వెల్లుల్లిని కూరగాయలతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుంది. అయితే వెల్లుల్లికి అనేక రకాల రెమెడీలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆరోగ్యంగా మనుగడ సాగించవచ్చు.

ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం వెల్లుల్లి రెబ్బలు బెస్ట్ రెమిడీ.. ఎలా తినాలంటే
Garlic Health Benefits
Follow us on

వంటగదిలోని పోపుల పెట్టే ఔషధాల గని.. వంటల్లో మసాలాగా ఉపయోగించే వెల్లుల్లికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వీటిని ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాదు ఔషధంగా కూడా పరిగణించబడుతుంది. ఇందులో సెలీనియం, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, థయామిన్, నియాసిన్, విటమిన్ సి, జింక్, పొటాషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. వర్షాకాలంలో రోజూ ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలితే ఏమౌతుందో తెలుసా?

వెల్లుల్లిని కూరగాయలతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుంది. అయితే వెల్లుల్లికి అనేక రకాల రెమెడీలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆరోగ్యంగా మనుగడ సాగించవచ్చు.

రోగనిరోధక శక్తి: వర్షాకాలంలో అనేక రకాల వైరల్ వ్యాధులు సంక్రమిస్తాయనే భయం పెరుగుతుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ సమస్యల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఆర్థరైటిస్ నొప్పి: వర్షాలు కురిసినప్పుడు గాలి, తేమ కారణంగా కీళ్లనొప్పులు ఉన్నవారి కీళ్లలో నొప్పి, వాపులు ఎక్కువవుతాయి. వీటి నుంచి ఉపశమనం కోసం ఆవనూనెలో వెల్లుల్లిని వేసి వేడి చేసి కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో అప్లై చేయడమే కాకుండా ప్రతిరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలితే, నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

చర్మ సమస్యలు: వర్షాకాలంలో ముఖంపై మొటిమలు, మచ్చల సమస్య ఎక్కువైతే, ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇది శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది. వెల్లుల్లి లక్షణాలు మొటిమలను నివారించడంలో, వదిలించుకోవటంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

జీర్ణ సమస్యలు: వర్షం కురిసే సమయంలో టీ, పకోడాలు తినాలని కోరుకుంటారు. ఈ సీజన్‌లో ప్రజలు ఎక్కువ మసాలా ఉన్న ఆహారాన్ని, వేయించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల వర్షాకాలంలో ఏర్పడే జీర్ణ సమస్యలకు దూరంగా ఉంటారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)