Maharashtra: విడాకులు తీసుకున్న స్త్రీలు, వితంతువులే అతని టార్గెట్.. ఏకంగా 25 పెళ్లిళ్లు..

ఈ వ్యక్తి అసలు పేరు ఫిరోజ్ షేక్. అయితే అన్వర్, రెహ్మాన్, రహీమ్, సురేష్ , రమేష్ ఇలా ఎన్నో మారు పేర్లు కూడా ఉన్నాయి. ఫిరోజ్ ఇప్పటి వరకూ 25 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని బాధితులుగా మార్చాడు. ఫిరోజ్ ఉద్దేశ్యం ఒక్కటే.. యువతులను పెళ్లి చేసుకుని వారిదగ్గర ఉన్న దోచుకుని పారిపోతాడు. అయితే ఫిరోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు లేదా మహిళల్లో ఎక్కువగా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారే ఉండడం విశేషం.

Maharashtra: విడాకులు తీసుకున్న స్త్రీలు, వితంతువులే అతని టార్గెట్.. ఏకంగా 25 పెళ్లిళ్లు..
Palghar Man
Follow us

|

Updated on: Jul 29, 2024 | 12:26 PM

మల్లాది వెంకట కృష్ణ మూర్తి మిస్టర్ వి నవలలో ఒక యువకుడు అమ్మాయిలకు వల వేసి పెళ్లి చేసుకుని నగలు, నగదు తీసుకుని పారిపోయేవాడు. అంతేకాదు తాను మరణించినట్లు ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసేవాడు. ఇలాంటి సంఘటన నిజ జీవితంలో జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా.. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది తాజా సంఘటన. ఒక యువకుడు ఒకటి కాదు రెండు ఏకంగా 25కి పైగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. పాపం పండి ఇన్నాళ్ళకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని నలసోపరాలో చోటు చేసుకుంది. పెళ్లి మీద పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత నిందితుడైన వరుడు వధువు వద్ద ఉన్న విలువైన వస్తువులు, నగలు, నగదు అన్నీ తీసుకుని పారిపోయేవాడు. అయితే ఈ వ్యక్తి 6 సార్లు జైలుకు కూడా వెళ్లాడు. అయినా పెళ్ళి మీద పెళ్లి చేసుకోవడం మాత్రం మానలేదు. నగరం, పేరు మార్చుకుని కొత్త ప్రదేశంలో అమ్మాయిలకు వల విసిరేవాడు.

ఈ వ్యక్తి అసలు పేరు ఫిరోజ్ షేక్. అయితే అన్వర్, రెహ్మాన్, రహీమ్, సురేష్ , రమేష్ ఇలా ఎన్నో మారు పేర్లు కూడా ఉన్నాయి. ఫిరోజ్ ఇప్పటి వరకూ 25 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని బాధితులుగా మార్చాడు. ఫిరోజ్ ఉద్దేశ్యం ఒక్కటే.. యువతులను పెళ్లి చేసుకుని వారిదగ్గర ఉన్న దోచుకుని పారిపోతాడు. అయితే ఫిరోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు లేదా మహిళల్లో ఎక్కువగా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారే ఉండడం విశేషం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఫిరోజ్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ షాదీ.కామ్‌లో పలు ప్రొఫైల్స్ సృష్టించాడు. దీని ద్వారా అతను వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు లేదా ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు అభ్యర్థనలు పంపేవాడు. వారితో స్నేహం చేసి తర్వాత ప్రేమ ఉచ్చులో బంధించేవాడు. పెళ్లి కూడా చేసుకుని కొద్దిరోజులు పెళ్లికూతురు దగ్గరే ఉండేవాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే వధువుకి సంబంధించిన విలువైన వస్తువులు, నగలు, నగదు తీసుకుని పారిపోయేవాడు.

ఇవి కూడా చదవండి

నేరం అంగీకరించిన నిందితుడు

చాలా మంది మహిళలు తాము పెళ్లి పేరుతో మోసపోవడం అవమానంగా భావించి ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదు. అయితే ఫిరోజ్ మోసానికి గురైన ఓ మహిళ నలసోపరాలో కేసు పెట్టింది. ఈ స్త్రీ విషయంలో కూడా అలాగే చేసాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు పథకం వేశారు. నకిలీ అమ్మాయి పేరుతో సోషల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశారు. ఫిరోజ్‌ను సంప్రదించారు. పెళ్లి గురించి చర్చలు జరిగాయి. నిందితుడు త్వరలోనే ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు. అప్పుడు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసిన ఫిరోజ్ ఖాన్ వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల నగదు, అమ్మాయిల ఏటీఎంలు, పాస్ బుక్కులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యక్తి మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పెళ్లి పేరుతో చాలా మంది అమ్మాయిలను బలిపశువుగా మార్చాడు. shaadi.com వంటి సైట్‌లో మీకు ఇలాంటి వ్యక్తి కనిపిస్తే ముందుగా అతని గురించి, అతని కుటుంబం గురించి ముందుగా తనిఖీ చేయాలని పాల్ఘర్ పోలీసులు మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వమని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు..
ఒలింపిక్స్‌లో నేడు మూడు పతకాలపై కన్నేసిన భారత ఆటగాళ్లు..
శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యంలో పెరుగుతున్న పులుల సంఖ్య..
శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యంలో పెరుగుతున్న పులుల సంఖ్య..
నంద్యాల జిల్లాలో వింత ఘటన: వేప చెట్టుకు పాలు..
నంద్యాల జిల్లాలో వింత ఘటన: వేప చెట్టుకు పాలు..
చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతో
చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతో
వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు.. త్వరలో అధికారిక ప్రకటన
వీసా లేకుండా ఆదేశాన్ని సందర్శించవచ్చు.. త్వరలో అధికారిక ప్రకటన
తల్లిని సుత్తితో కొట్టి చంపి.. ఆపై పక్కనే ఉన్న దూలానికి...
తల్లిని సుత్తితో కొట్టి చంపి.. ఆపై పక్కనే ఉన్న దూలానికి...
భారత టెన్నిస్ దిగ్గజాలకు బిగ్ షాక్.. తొలి రౌండ్‌ నుంచే నిష్క్రమణ
భారత టెన్నిస్ దిగ్గజాలకు బిగ్ షాక్.. తొలి రౌండ్‌ నుంచే నిష్క్రమణ
మహేష్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం
మహేష్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు
ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై