AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Hair Care: వర్షాకాలంలో చుండ్రు సమస్య.. ఈ 5 ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్‌ పెట్టండి.. జుట్టును బలంగా ఉంచుకోండి!

వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధులతో పాటు జుట్టు రాలడం, చుండ్రు పెరగడం అనేది ఒక ప్రధాన సమస్య. వర్షా కాలంలో మన జుట్టు ఎక్కువగా తడవడం కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు కూడా వేగంగా పెరుగుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, చిట్లడం మరియు చివర్లు చిట్లడం వంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, వర్షాకాలంలో మీ జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కాబట్టి వర్షాకాలంలో చుండ్రు సమస్య నుంచి ఉపసమనం పొందేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.

Monsoon Hair Care: వర్షాకాలంలో చుండ్రు సమస్య.. ఈ 5 ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్‌ పెట్టండి.. జుట్టును బలంగా ఉంచుకోండి!
Dandruff Prevention Tips
Anand T
|

Updated on: Sep 27, 2025 | 5:43 PM

Share

చుండ్రును సాధారణ సమస్యగా భావించి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ చుండ్రు క్రమంగా తలలో ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడానికి దారితీస్తుందని మీకు తెలుసా? దీని వల్ల భవిషత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను మొదట్లోనే పరిష్కరించుకోవడం ముఖ్యం. కాబట్టి వర్షంలో తడిసిన వెంటనే మీరు మీ జుట్టును శుభ్రంగా కడుక్కోని పూర్తిగా ఆరబెట్టుకోండి. తడి జుట్టుకు రబ్బర్ బ్యాండ్స్ వేసి కట్టకండి, ఎందుకంటే ఇది ఫంగస్ పెరగడానికి దారితీస్తుంది. మీ జుట్టును సహజంగా ఆరనివ్వడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగించే బదులు, టవల్‌తో మెల్లగా ఆరబెట్టి గాలిలో ఆరనివ్వండి.

చుండ్రు సమస్యను ఈ చిట్కాలతో పరిష్కరించుకోండి

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి మీ తలకు మసాజ్ చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది. అలాగే తలకు తేమను అందిస్తుంది.

అలోవెరా జెల్: తాజా కలబంద జెల్ తీసుకొని మీ తలకు అప్లై చేయండి. అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఇది తలలో చికాకు, చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన భాగాలుగా కలిపి తలస్నానం చేసే ముందు తలకు పట్టించి 15 నిమిషాల ఉంచండి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోండి. ఇది చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుదలను సహాయపడుతుంది.

మెంతులు: మెంతుల గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత జుట్టు కడుక్కోవడం వల్ల చుండ్రు, దురద తొలగిపోతాయి. ఇది మీ జుట్టుకు పోషణనిస్తుంది.

టీ ట్రీ ఆయిల్: మీ షాంపూలో టీ ట్రీ ఆయిల్ కలిపి మీ తలకు అప్లై చేయండి. ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది సహజంగా చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ తలని శుభ్రపరుస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!