Honey: పొరపాటున కూడా తేనెతో ఈ పదార్థాలు అస్సలు కలపండి.. యమ డేంజర్!

తేనె ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తేనెతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. తేనె తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిది. తేనె కేవలం ఆరోగ్యానికే కాకుండా జుట్టును బలంగా ఉంచడంలో, చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఉపయోగ పడుతుంది. చిన్న పిల్లలకు తరచూ ఓ స్పూన్ తేనె తినిపిస్తే.. వారిలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి వారికి లభిస్తుంది. తేనె అనేది ఓ నేచురల్ స్వీటెనర్. కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. చాలా మంది తేనెను..

Honey: పొరపాటున కూడా తేనెతో ఈ పదార్థాలు అస్సలు కలపండి.. యమ డేంజర్!
Honey
Follow us

|

Updated on: Oct 21, 2024 | 1:20 PM

తేనె ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తేనెతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. తేనె తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిది. తేనె కేవలం ఆరోగ్యానికే కాకుండా జుట్టును బలంగా ఉంచడంలో, చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఉపయోగ పడుతుంది. చిన్న పిల్లలకు తరచూ ఓ స్పూన్ తేనె తినిపిస్తే.. వారిలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి వారికి లభిస్తుంది. తేనె అనేది ఓ నేచురల్ స్వీటెనర్. కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. చాలా మంది తేనెను వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటూ ఉంటారు. తేనె తినడం మంచిదే. కానీ కొన్ని రకాల పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల అనేక రకాల సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి తేనెను ఎలా తీసుకోకూడదో.. ఎలాంటి పదార్థాలతో కలపకుండా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం

వేడి నీటిలో అస్సలు కలపకండి:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే తేనెలను వేడి నీటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు. వేడి నీటిలో నిమ్మ రసం, తేనె కలిపి పరగడుపున తాగే అలవాటు చాలా మందికి ఉంది. కానీ ఇది చాలా తప్పు. తేనెను వేడి నీటిలో కానీ.. వేడి వేడి ఆహార పదార్థాలతో కానీ కలిపి అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల తేనె వల్ల అందే ప్రయోజనాలు లభించవు. జీర్ణ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

కీరా:

కీరా – తేనె ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిపి తీసుకోకూడదు. కీరా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ తేనెతో కలిపి తీసుకుంటే.. మాత్రం జీర్ణ క్రియపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ రెండింటి స్వభావం వేరు. కీరా చలవ చేస్తే.. తేనె వేడి చేస్తుంది. ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడి.. సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

సిట్రస్ ఫ్రూట్స్:

చాలా మంది జ్యూసుల్లో పంచదారకు బదులు తేనె కలిపి తాగుతారు. ఇది కూడా మంచిదే. కానీ సిట్రస్ ఫ్రూట్స్‌, తేనె అస్సలు కలిపి తీసుకోకూడదు. సిట్రస్ ఫ్రూట్స్‌లో ఉండే మంచి యాసిడ్స్‌ని తేనె పాడు చేస్తుంది. దీంతో రుచి, గుణం కూడా మారిపోతాయి.

పాలు – వెల్లుల్లి:

పాలు, వెల్లుల్లి వంటి వాటితో కూడా తేనె కలిపి తీసుకోకూడదు. పాలు లేదా పాల ఉత్పత్తులతో తేనె కలిపి తీసుకుంటే.. విషంగా మారవచ్చు. దీని వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి అస్సలు తీసుకోకండి. వెల్లుల్లితో కలిపి తీసుకుంటే పోషకాలు సరిగా అందవు. ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!