స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవుతారు..!
Jyothi Gadda
20 October 2024
ఇది ఒక అద్భుతమైన పండు. మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలతో నిండి ఉంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇండోనేషియాకు చెందిన ఒక ప్రత్యేకమైన పండు.
స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. కంటి ఆరోగ్యం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకూ అనేక లాభాలు ఉన్నాయిని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులను నివారిస్తుంది.
స్నేక్‌ఫ్రూట్ తినటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ పండులో ఉండే అధిక పొటాషియం కారణంగా శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
స్నేక్ ఫ్రూట్ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఈ పండులో చక్కెర శాతం తక్కువగా ఉండడం వల్ల బ్లడ్‌షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది. స్నేక్ ఫ్రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా మంచిది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
స్నేక్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ముడతలు, మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్నేక్ ఫ్రూట్ లో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయం.