Flying Taxis: త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలు అందించేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిద్ధమైంది. త్వరలోనే నగరంలో ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
ప్రస్తుతం ఇందిరానగర్ నుంచి విమానాశ్రయానికి చేరాలంటే గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు అని సార్లా ఏవియేషన్ సీఈఓ ఏడ్రియన్ ష్మిత్ అన్నారు. ఇదో గేమ్ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.
ఈ ఎగిరే ట్యాక్సీలు సాధారణ హెలికాప్టర్ల కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి ఎలాంటి హాని కలిగించవు. కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు. తీవ్రమైన రద్దీతో ఇబ్బంది ఎదుర్కొంటున్న బెంగళూరు నగరవాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ తరహా సేవలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేవి కావడంతో అందరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

