థైరాయిడ్ సమస్య ఉన్న వారు తీవ్రమైన అలసటతో ఇబ్బంది పడుతుంటారు. ఎలాంటి పనిచేయకపోయినా తరచూ ఇట్టే అలసిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి కారణం లేకుండా ఉన్నపలంగా బరువు పెరుగుతన్నారా.? అయితే ఓసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్. బరువు పెరగడం కూడా థైరాయిడ్ సమస్యకు లక్షణంగా భావించాలి.
అలాగే ఒక్కసారిగా బరువు తగ్గినా.? అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. హైపర్
థైరాయిడ్ కారణంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు అంటున్నారు.
ఎలాంటి కారణం లేకుండా జుట్టు రాలిపోతుంటే థైరాయిడ్ సమస్య ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
ఇక ఉన్నపలంగా చమటలు వస్తున్నా.? ఎలాంటి శారీరక శ్రమలేకపోయినా అదే పనిగా చెమటలు వస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
థైరాయిడ్ సమస్య వస్తే శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. ఉష్ణోగత్ర పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చర్మం పొడిబారడం ఈ సమస్యకు లక్షణంగా చెప్పొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.