వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరిసిపోవడం సహజం. కానీ కొందరికి చిన్న వయసులోనే జుట్టు నెరిసి తెల్లగా మారుతుంది. అకాల జుట్టు నెరసిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి ప్రజలు రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో చాలా వరకు హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇది మీ జుట్టును మరింత దెబ్బతీస్తుంది. కానీ, ఇంట్లో లభించే కొన్ని వస్తువులు మీ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. అందులో నిమ్మరసం తెల్లజుట్టుకు బెస్ట్ హోం రెమెడీ. ఇది తెల్ల జుట్టుకు మాత్రమే కాకుండా చుండ్రు సమస్యకు కూడా శీఘ్ర పరిష్కారాన్ని ఇస్తుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే జుట్టు నల్లగా, దృఢంగా మారుతుంది.
జుట్టు నల్లగా మారడానికి ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయండి. దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలకు బాగా పట్టించండి. తర్వాత చేతులతో కాసేపు మసాజ్ చేయాలి. సుమారు 1 గంట తర్వాత, తేలికపాటి షాంపూ ఉపయోగించి జుట్టును కడగాలి. కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు, దురద సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే, జుట్టును దృఢంగా, ఒత్తుగా మార్చుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
జుట్టును సరిగ్గా, క్రమం తప్పకుండా షాంపూ చేయకపోవడం వల్ల ఎక్కువగా చుండ్రు, తల దురద వంటి సమస్యలు వస్తాయి. చుండ్రు పోవాలంటే నెత్తిని ఎప్పటికప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. షాంపూను బాగా కడిగి తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోతుంది. చుండ్రు నివారణతో మీ జుట్టు క్రమంగా ఒత్తుగా నల్లగా మారుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..