ఉదయం ఒక గ్లాసు నీటిలో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను రెండు నిమిషాలపాటు నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని వండినప్పుడు అల్లిసన్ పలుచన అవుతుంది. కాబట్టి పచ్చిగానే ఖాళీ కడపుతో తినాలని వెద్యులు చెబుతున్నారు. వెల్లుల్లితో పాటు నిమ్మ రసం, లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి టీని ఉదయాన్నే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుంది.
వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, పొటాషియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లి రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
ఇక, వెల్లుల్లి రసం తాగడం వల్ల పొట్టలోని ఇన్ఫెక్షన్లు, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ దీనికి సహాయపడుతుంది. వెల్లుల్లి శ్వాసకోశ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ భాగాలు దీనికి సహాయపడతాయి.
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెల్లుల్లి రసం తాగాలి. ఇది చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. వెల్లుల్లి రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. రోజూ వెల్లుల్లి రసం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
ఉదయాన్నే వెల్లుల్లి రసాన్ని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరం అవుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. వెల్లుల్లి కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిది. కాలేయం, మూత్రపిండాలు, రక్తప్రవాహానికి అద్భుతమై డిటాక్స్ ఫైయర్ గా పనిచేస్తుంది. మెదడు పనితీరును రక్షిస్తుంది. జ్ఞాపకశక్తి, దృష్టి మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌ల రిస్క్ తగ్గుతుంది. బరువు తగ్గడానికి వెల్లుల్లి రసాన్ని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. శరీరంలోని అనవసరమైన క్యాలరీలను కరిగించడంలో ఇవి మేలు చేస్తాయి. వెల్లుల్లి రసం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..