Plastic Bag Risks: కూరగాయలు, పండ్లు ప్లాస్టిక్ బ్యాగ్స్ లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్..

ప్రస్తుతం మానవ జీవితం సమస్తం ప్లాస్టిక్ మయం. ఆహారపు వస్తువులు ఇంటికి తీసుకుని రాలన్నా, ఆహార పదార్ధాలు నిల్వ చేయలన్నా.. ఇలా ప్రతి దానికి ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవును టీ బ్యాగులు, శాండ్‌విచ్‌లు లేదా ప్యాక్ చేసిన ఆహారం ఇలా ప్రతిదానికి ప్లాస్టిక్ బ్యాగ్స్ నే ఉపయోగిస్తున్నారు. కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టిన కూరగాయలు వంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో కూడా ఇలా నిల్వ చేస్తారు. అయితే ఇలా ప్లాస్టిక్ బ్యాగుల వాడకం ఆరోగ్యంపై ఎంత చెడు ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా. దీనికి సంబంధించిన ఒక పరిశోధన బయటకు వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం.

Plastic Bag Risks: కూరగాయలు, పండ్లు ప్లాస్టిక్ బ్యాగ్స్ లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్..
Plastic Bag Risks

Updated on: Jul 23, 2025 | 4:08 PM

భారతీయ ఇళ్లలో మహిళలు తరచుగా కూరగాయలు కొని వాటిని ప్లాస్టిక్ సంచులలో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. ఈ అలవాటు సర్వసాధారణం. అయితే ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో ఎవరూ ఊహించరు. ఇటీవల ఒక అధ్యయనం ప్లాస్టిక్ సంచులలో ఉంచిన వస్తువులు ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తాయో వెల్లడించింది.

ఈ రోజుల్లో మనం చాలా ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచులలో లేదా కంటైనర్లలో పెట్టడం సర్వసాధారణం. తరువాత వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అది బయటి నుంచి తెచ్చిన శాండ్‌విచ్ అయినా లేదా ప్యాక్ చేసిన ఆహారం అయినా.. ఇది సాధారణ అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో ఈ రోజు తెలుసుకుందాం?

పరిశోధన ఏం చెబుతోంది?
NPJ సైన్స్ ఆఫ్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం గాజు, ప్లాస్టిక్ బాటిళ్ల మూతలను పదే పదే తెరవడం, మూసివేయడం వల్ల వాటిలో ఉండే మైక్రోప్లాస్టిక్, నానోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. అవి మనం తాగే పానీయాలలో కరిగిపోతాయని వివరిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆహార పదార్థాలపై పరిశోధన చేసే సంస్థ ఫుడ్ ప్యాకేజింగ్ ఫోరం సైంటిఫిక్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఈ విషయంపై స్పందిస్తూ. బాటిల్ తెరవడానికి చేసే ప్రతి ప్రయత్నంతో మైక్రోప్లాస్టిక్‌ల సంఖ్య పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అంటే బాటిల్ తెరిచిన ప్రతిసారీ, మైక్రో, నానోప్లాస్టిక్‌లు విడుదలవుతాయి. అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు బీర్, క్యాన్డ్ ఫిష్, రైస్, మినరల్ వాటర్, టీ బ్యాగులు, టేబుల్ సాల్ట్, టేక్‌అవే ఫుడ్ , సాఫ్ట్ డ్రింక్స్ వంటి ఆహారాలు , పానీయాలలో సూక్ష్మ, నానోప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయి.

మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏమిటి?
మైక్రోప్లాస్టిక్‌లు అంటే ఇవి చిన్న ప్లాస్టిక్ కణాలు. అవి కనిపించవు. అవి ప్లాస్టిక్ విచ్ఛిన్నం ద్వారా ఏర్పడతాయి. కొన్నిసార్లు వాటి పరిమాణం కొంచెం పెద్దదిగా ఉండవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం వీటిని ప్రతి ప్లాస్టిక్ వస్తువులోనూ కనుగొంటారు. ఇప్పుడు అవి మన ఆహార పదార్థాలకు కూడా చేరుకున్నాయని ఇటీవలి పరిశోధనలో కూడా ఇది వెల్లడైంది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు ఇప్పుడు ఆహారాన్ని ఎలా కలుషితం చేస్తున్నాయో స్పష్టంగా వివరిస్తుంది. ఇవి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ప్లాస్టిక్ సంచులలో ఆహారాన్ని నిల్వ చేయడం ఎంత ప్రమాదకరం?
ప్రస్తుతం ప్లాస్టిక్ ని ప్రతిదానిలోనూ వాడుతున్నారు. అది ఆహారం, పానీయం లేదా పాత్రలు కావచ్చు. అటువంటి పరిస్థితిలో మైక్రోప్లాస్టిక్‌లు మన ఆహారం, పానీయం, వంటగదిలో వేగంగా కలిసిపోతున్నాయి. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కణాలు చాలా చిన్నవిగా ఉండటం వలన అవి ఒక వ్యక్తి కణజాలాలలో కలిసిపోతాయి. రక్తం ద్వారా శరీరమంతా వ్యాప్తి చెందుతాయి. ప్యాక్ చేసిన ఆహారాన్ని పరిశోధించగా 96% వరకు మైక్రోప్లాస్టిక్‌లు కనుగొనబడ్డాయని పరిశోధన పేర్కొంది.

శరీరంపై మైక్రోప్లాస్టిక్స్ చెడు ప్రభావం
ఇటీవలి పరిశోధనలో మైక్రోప్లాస్టిక్‌లు ఇప్పుడు ప్రజల రక్తం, ఊపిరితిత్తులు, మెదడుల్లో కూడా వ్యాపిస్తున్నాయని తేలింది. 80% మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది దీని బారిన పడుతున్నారు. అదే సమయంలో దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరిగింది. మరో పరిశోధనలో దాదాపు 58% మంది ధమనులలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు తేలింది. దీని కారణంగా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నవారిలో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు 4.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

మైక్రోప్లాస్టిక్స్ వల్ల కలిగే దీర్ఘకాలిక వాపు గురించి హార్వర్డ్ పరిశోధకులు కూడా ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల శరీరంలో మంట చాలా కాలం పాటు కొనసాగుతుంది. శరీరంలో దీర్ఘకాలిక వాపు, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకుండా కూరగాయలను ఎలా నిల్వ చేయాలంటే
కూరగాయలు లేదా ఇతర వస్తువులను ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయడానికి బదులుగా అనేక ఇతర పద్ధతులను ప్రయత్నించవచ్చు. దీని కోసం నెట్ బ్యాగులు, స్టీల్ పాత్రలు లేదా మంచి పదార్థంతో తయారు చేసిన బుట్టలను ఉపయోగించవచ్చు. అయితే మనకు అవసరమైనన్ని కూరగాయలు లేదా పండ్లు మాత్రమే కొనుగోలు చేయాలి. షాపింగ్ చేసేటప్పుడు బట్టతో చేసిన బ్యాగ్ లు లేదా నెట్ బ్యాగులను తీసుకెళ్లండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)