నేటి బిజీ షెడ్యూల్ లైఫ్‌లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతం అవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు, ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నికంటే ముఖ్యంగా జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా ఆలోచనా శక్తి తగ్గుతుంది. అయితే, ఇలాంటి పరిస్థితి రావొద్దంటే.. కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మానసిక ఆరోగ్యంగా బాగుండాలంటే.. దుయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తప్పక చేయాలి. చాలా మంది హడావుడిలో ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే.. ఉదయం వేళ అల్పాహారం మానకండి.
స్వీట్లను ఇష్టపని వారు ఎవరుంటారు చెప్పండి. కానీ, ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, ఖర్జూరం మొదలైన సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ.. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. మానసిక సమస్యలను పెంచుతుంది.
జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్ర పోవడం తప్పనిసరి. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. లేకపోతే మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపి.. ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలన్నీ నిపుణులు అందించిన సాధారణ సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..