
త్వరలో నూతన సంవత్సరం వస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం సరికొత్త గోల్స్ తో ఉండాలని అనుకుంటారు. మరికొంత మంది ఏదో ఓ రిజుల్యూషన్ ను 2023 ను ప్రారంభించాలని కోరుకుంటారు. న్యూ ఇయర్ లో మానసిక ప్రశాంతత మా రిజుల్యూషన్ అంటూ చాలా మంది చెబుతుంటారు. కానీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మనస్సు ఆలోచనలతో నిండిపోయి ఉంటే ప్రశాంతత ఎక్కడ వస్తుందని నిట్టూరుస్తుంటారు. మందులు లేకుండా సహజంగా కూడా మానసిక ఆందోళన నుంచి గట్టెక్కవచ్చు. ఇష్టమైన ఆహారం తింటూ, ఫ్రెండ్స్ తో హ్యాపీగా గడపడం వంటి చర్యలు తీసుకుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పే టిప్స్ ను ఓ సారి చూద్దాం.
ప్రస్తుత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. విశ్రాంతి అనేది మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, నచ్చిన మ్యూజిక్ వినడం, బుక్స్ చదవడం లేదా మనకు నచ్చిన పని చేస్తూ రిలాక్స్ అయితే మేలు కలుగుతుందని నిపుణులు అభిప్రాయం.
జీవితంలో కృతజ్ఞత పాటిస్తే మనస్సుపై సానుకూల దృక్పథాన్ని సృష్టించవచ్చు. మానసిక ఆరోగ్యానికి స్పష్టమైన ప్రయోజనాలను కలగాలంటే కచ్చితంగా ఒత్తిడిని, డిప్రెషన్ లక్షణాలను జయించాలి. ఇతరులపై కృతజ్ఞతా భావంతో ఉంటేనే ఇది సాధ్యం. దీన్ని పాటించడం కష్టమైన పనే అయితే తప్పకుండా పాటిస్తే మంచిది.
మన వర్క్ అయ్యాక కచ్చితంగా ప్రతి రోజు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో సమయాన్ని గడపడం వల్ల మానసికంగా మేలు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల వారిపై మనకు సానుకూల దృక్పథం పెరుగుతుంది. మన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోడానికి కూడా దోహదం చేస్తుంది. మనం ఒంటరిగా ఫీలైనప్పుడు వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మనం మానసింకంగా ప్రశాంతంగా ఉండాలంటే శారీరంకంగా కూడా ధృఢంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం కోసం కచ్చితంగా నిద్రపోవాలి. నిద్రపోకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు. పైగా మానసిక ఆందోళనకు కారణమవుతుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని కూడా అందించాలి. మానసిక స్థితిని మెరుగుపర్చడం కోసం కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మనం స్నేహితులతో లేదా ఫ్యామిలీతో హ్యాపీగా గడిపిన ఫొటోస్ కచ్చితంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. అలాగే మనకు బాగా కావాల్సిన వారు కూడా వారి ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తుంటారు. ఖాళీ సమాయాల్లో సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తే మనకు మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే డిప్రెషన్ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. కాకపోతే అదే పనిగా మాత్రం సోషల్ మీడియాను ఉపయోగించకుండా కాల పరిమితితో ఉపయోగిస్తే మంచిది.
నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం. నవ్వకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. కొన్నిసార్లు నవ్వు అనేది ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది. మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి టీవీ షో లేదా మూవీని చూస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. స్నానం చేస్తున్నప్పుడు పాడడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. డ్యాన్స్ చేసినా కూడా మనలోని ఒత్తిడి స్థాయిని కంట్రోల్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
అయితే ఇవన్నీ ఓ రోజు చేస్తే మానసిక ప్రశాంతత కలగదు. కొన్ని రోజుల పాటు దినచర్యగా చేస్తేనే మనం ఫలితాన్ని అనుభవించవచ్చని గుర్తుంచుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..