Sleeping Disorder: పడుకునే సమయంలో ప్రశాంత నిద్ర ఎంతసేపు ఉంటుందో తెలుసా? నిద్రపోకపోతే వచ్చే సమస్యలేంటి? నిపుణుల సూచనలివే..

| Edited By: Anil kumar poka

Jan 01, 2023 | 1:26 PM

నాణ్యమైన నిద్ర అంటే పడుకునే సమయం కాదని ప్రశాంతంగా గాఢనిద్ర ఎంతసేపు పట్టిందనే సమయాన్ని లెక్కిస్తారు. పడుకునే సమయంలో 85 శాతం గాఢ నిద్రను పొందితే దాన్ని ప్రశాంత నిద్రగా పేర్కొనవచ్చు. అలాగే పడుకునే సమయంలో మెలకువగా ఉండి కొంత సమయం తర్వాత పడుకుంటే అది ప్రశాంత నిద్ర సమయాన్ని చెడగొడుతుంది.

Sleeping Disorder: పడుకునే సమయంలో ప్రశాంత నిద్ర ఎంతసేపు ఉంటుందో తెలుసా? నిద్రపోకపోతే వచ్చే సమస్యలేంటి? నిపుణుల సూచనలివే..
Follow us on

నిద్ర అనేది సామాన్యుడి దగ్గర నుంచి ధనికుడ వరకూ ప్రతి ఒక్కరి కనీస అవసరమైన చర్య. మన శరీరం అలసటకు గురైనప్పడు తప్పినిసరిగా పడుకోవాలి అని మెదడు ప్రేరేపిస్తుంటుంది. మెదడులో ఉండే సిర్కాడియన్-రిథమ్ మనకు పగలు రాత్రి అనే తేడాను తెలిసేలా చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నాణ్యమైన నిద్ర అంటే పడుకునే సమయం కాదని ప్రశాంతంగా గాఢనిద్ర ఎంతసేపు పట్టిందనే సమయాన్ని లెక్కిస్తారు. పడుకునే సమయంలో 85 శాతం గాఢ నిద్రను పొందితే దాన్ని ప్రశాంత నిద్రగా పేర్కొనవచ్చు. అలాగే పడుకునే సమయంలో మెలకువగా ఉండి కొంత సమయం తర్వాత పడుకుంటే అది ప్రశాంత నిద్ర సమయాన్ని చెడగొడుతుంది. సాధారణంగా పడుకున్న వెంటనే ఎవ్వరికీ నిద్ర పట్టదు. ఓ 30 నిమిషాల తర్వాతే నిద్ర పడుతుంది. అంతకంటే ఎక్కువ సేపు నిద్ర పట్టకపోతే నిద్ర లేమి సమస్య వస్తుంది. గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత ఎవరైనా మనల్ని లేపి నిద్రను డిస్ట్రబ్ చేస్తే నిద్ర లేమితో బాధపడతాం.

నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు

  • సాధారణంగా మనం పడుకునే సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కానీ మెదడు మాత్రం ఎక్కువగా పని చేస్తుంది. ఏకీకరణ ప్రక్రియ చేస్తుంది. అంటే మనం రోజంతా చేసిన పనులను జ్ఞాపకశక్తి మారుస్తుంది. సో నిద్ర లేమితో జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
  • నిద్రపోతున్నప్పుడు మన శరీరం మెలటోనిన్ తో సహా చాలా గ్రోత్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. అందువల్ల నిద్రలేమితో శారీరక ఎదుగుదల తగ్గుతుంది. 
  • ముఖ్యంగా నిద్రలేకపోతే ఒత్తిడి,చికాకు, కోపం, విచారం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటాం. అలాగే కొద్దిపాటి పని చేసినప్పుడే అలసటకు గురవుతాం.
  • నిద్రలేమి సమస్య ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో మనం ఇతర సమస్యలకు గురవుతాం. ఓ అధ్యయనం ప్రకారం నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కరోనా వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికంగా ఉన్నాయని తేలింది.

ప్రశాంత నిద్రను ఎలా పొందాలి?

  • మనం పడుకునే చోటు చాలా పరిశుభ్రంగా ఉండాలి. 
  • అలాగే పడక గది టెంపరేచర్ అనువుగా ఉండాలి.
  • ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాలి.
  • పడుకునే ముందు టీవీను, ఫోన్ చూడడం మానేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నిద్రకు అవసరమయ్యే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. 
  • అలాగే పడుకునే ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..