మామిడి ఆకుల్లో దాగివున్న ఆరోగ్యం..! ఇలా వాడితే మధుమేహం సహా మరెన్నో రోగాలు పరార్..

పండ్లలో రారాజు మామిడి అంటారు. మామిడి చాలా మందికి ఇష్టమైన పండు. ప్రజలు దీనిని పండిన పండుగా తినడమే కాకుండా, పచ్చి మామిడికాయ పచ్చడి, పన్నా లేదా ఊరగాయ చేసి తినడానికి ఇష్టపడతారు. ఎంతో రుచిగా ఉండే మామిడిపండు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మామిడి మాత్రమే కాదు, దాని ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. మామిడి ఆకుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం-

మామిడి ఆకుల్లో దాగివున్న ఆరోగ్యం..! ఇలా వాడితే మధుమేహం సహా మరెన్నో రోగాలు పరార్..
Mango Leaves
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 16, 2024 | 12:06 PM

మామిడి ఆకులు పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచెబుతున్నారు. మామిడి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేసి లావు తగ్గేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, మామిడి ఆకులు ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, ఫ్లేవనాయిడ్లు , శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కడుపులో అల్సర్లను తగ్గించి, జీర్ణక్రియ మెరుగయ్యేలా మామిడి ఆకులు చేస్తాయి.

మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. మామిడి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రంతా ఉంచి ఉదయాన్నే వడకట్టుకుని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లేత మామిడి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా చెబుతున్నారు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులను నమిలి తిన్నా, లేదా మామిడి ఆకులను మరిగించి కషాయంలా తీసుకున్న మధుమేహం అదుపులో ఉంటుంది.

మామిడి ఆకులలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. మామిడి ఆకులు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకుల టీ తయారుచేసుకుని తాగిన, మామిడాకులను మరిగించి ఆ నీటితో స్నానం చేసిన ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. మామిడి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. జుట్టు నెరిసిపోకుండా ఇవి కాపాడతాయి. ఇవి కొలాజిన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకులతో టీ, ఆకులను మరిగిస్తే వచ్చే రసం, ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?