సర్వకాల సర్వావస్థల్లో ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో
TV9 Telugu
అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకా పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అరటి పండు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులను రానివ్వదు. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది
TV9 Telugu
ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది. అరటిపండు మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తుంది
TV9 Telugu
అరటిపండులోని పొటాషియం, మెగ్నీషియం మూలకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటిపండులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ఈ పండులో మంచి మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అరటిపండు తీసుకోవడం వల్ల బరువు కూడా సులువుగా తగ్గవచ్చు
TV9 Telugu
ఇది చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. అరటిపండు తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఉంటుంది. అయితే కొన్ని సమస్యలున్న వారు మాత్రం అరటి పండ్లు అస్సలు తీసుకోకూడదు
TV9 Telugu
అయితే మలబద్ధకం, జలుబు సమమ్యలు ఉన్నవారు మాత్రం దీనిని చలికాలంలో తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రతరం అవుతుంది