అందుకే జామను ‘పేదవాడి యాపిల్’గా పిలుస్తారు. ఇందులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. తరచూ అనారోగ్యాల బారినపడకుండా కాపాడుతుంది
TV9 Telugu
వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. వీటిల్లో ఉండే అధిక పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
TV9 Telugu
గుండెపోటుకు గురికాకుండా సాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికీ తోడ్పడుతుంది. ఇందులో ఎక్కువగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
TV9 Telugu
జామలో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్‌తోపాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు జామ తిన్నొచ్చో.. లేదోనన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది
TV9 Telugu
నిజానికి జామకాయల్లో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడానికి సాయపడతాయి. ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది
TV9 Telugu
జామలోని పీచు పదార్థం మలబద్ధకాన్నీ పోగొడుతుంది. పీచు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి సరైన ఎంపిక
TV9 Telugu
వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. అందుకే రోజూ తప్పనిసరిగా ఓ జామ పండుని తినమని చెబుతున్నారు నిపుణులు.