Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods for mood swings: ఈ ఆహారంతో మీ మూడ్ అలా మారిపోతుంది.. రోజంతా చురుగ్గా ఉంటారు..

మూడ్ స్వింగ్స్ కేవలం హారోన్ల సమస్య కారణంగా రాదు.. పోషకాహార లోపం వల్ల కూడా వస్తుందని పేర్కొన్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చని వివరించారు.

Foods for mood swings: ఈ ఆహారంతో మీ మూడ్ అలా మారిపోతుంది.. రోజంతా చురుగ్గా ఉంటారు..
Food For Mood
Follow us
Madhu

|

Updated on: Feb 10, 2023 | 12:15 PM

సాధారణంగా మనిషి ఆరోగ్యం జీవన శైలి, తీసుకునే ఆహారం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మానసిక ఆరోగ్యం మన అనుభవించే ఒత్తిడి, మన ఆలోచనల కారణంగా కొంత ప్రభావితం అవుతుంది. రోజంతా చురుగ్గా.. ఉత్సాహంగా ఉండటంలో ఇవి సాయపడతాయి. అయితే చాలా మంది ఆకస్మాత్తుగా డల్ అయిపోవడం.. నిస్సత్తువ ఆవరించినట్లు అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. దీనిని మూడ్ స్వింగ్ అంటారు. ఇది ఎక్కువగా మహిళల్లో మనం గమనిస్తాం. ప్రీ మెన్‌స్ట్రు‌వల్ సిండ్రోమ్(పీఎంఎస్) సమయంలో వారిలో నిస్సత్తువ, అసహనం, చిరాకు, కోపంతో పాటు వస్తుంటాయి. దీనికి ఆ సమయంలో కలిగే హార్మోన్ల అసమతుల్యత కారణంగా వారికి ఇలా జరుగుతుంది. అయితే ఇది కేవలం హార్మోనల్ సమస్య మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అందవలసిన పౌష్టికాహారం సక్రమంగా అందకపోయిన ఈ మూడ్ స్వింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పోషకాహార నిపుణులురాలు ఎన్మామీ అగర్వాల్ తన ఇన్‌‌స్టాగ్రామ్ పేజీపై ఓ వీడియోను షేర్ చేశారు. మూడ్ స్వింగ్స్ కేవలం హారోన్ల సమస్య కారణంగా రాదు.. పోషకాహార లోపం వల్ల కూడా వస్తుందని పేర్కొన్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చని వివరించారు. కొన్ని ఆహార పదార్థాలు సూచించారు. వీటిని రోజూ వారీ డైట్ లో చేర్చుకుంటే మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుందని చెప్పారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nmami (@nmamiagarwal)

బచ్చలికూర: బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, ఫినైలేథైలమైన్ పుష్కలంగా ఉంటాయి. ఇది డోపమైన్ లోని సినాప్టిక్ స్థాయిలను పెంచుతుంది. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ మానసిక స్థితి ఒత్తిడి తగ్గిస్తుంది. ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది.

పులియబెట్టిన ఆహారాలు: పెరుగు, కిమ్చి వంటి ఆహారాలు పేగుల ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోబయోటిక్ ఎంపికలు. ఇవి మానసిక స్థితిని పెరుగుపరచడానికి సాయమందిస్తాయి.

ప్రోటీన్: అమైనో ఆమ్లాలతో కూడిన ప్రోటీన్లు న్యూరోట్రాన్స్మిటర్లు పనిచేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లతో మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మీరు మీ మానసిక స్థితిని సరిచేయడానికి మీ ఆహారంలో మల్బరీలు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలను జోడించవచ్చు.

  • వీటితో పాటు చేపలు, గింజలు, తృణధాన్యాలు, బెర్రీలు, పైనాపిల్, అరటిపండులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా లభిస్తాయి. వీటని కూడా మీ రోజువారీ డైట్లో చేర్చడం ద్వారా మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ