Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే, సాయంత్రం వేళ ఇలాంటి తప్పులు చేయకండి..

Weight Loss Tips in Telugu: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి.. ముందు మీరు మీ గురించి కొంచెం శ్రద్ధ వహించాలి. అధిక స్థూలకాయం మీ వ్యక్తిత్వాన్ని పాడు చేయడంతోపాటు.. అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే, సాయంత్రం వేళ ఇలాంటి తప్పులు చేయకండి..
Weight Loss
Follow us

|

Updated on: Jun 08, 2023 | 4:17 PM

Weight Loss Tips in Telugu: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి.. ముందు మీరు మీ గురించి కొంచెం శ్రద్ధ వహించాలి. అధిక స్థూలకాయం మీ వ్యక్తిత్వాన్ని పాడు చేయడంతోపాటు.. అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. అదే సమయంలో, నేటి కాలంలో బరువు తగ్గడానికి ప్రజలు డైటింగ్, జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంత చేసినా బరువు తగ్గడం లేదు. అటువంటి పరిస్థితిలో మీరు బరువు తగ్గాలనుకున్నా.. తగ్గే క్రమంలో సాయంత్రం వేళల్లో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. 7 గంటల తర్వాత మీరు చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గే క్రమంలో సాయంత్రం వేళ ఈ తప్పులు చేయకండి..

  1. కెఫిన్ – పానీయాలు: కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవడం మానుకోండి. ఈ రకమైన పానీయాలు మీ నిద్రను దూరం చేయడం ద్వారా మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే కెఫిన్ ఉన్న పానీయాలకు బదులు హెర్బల్ టీని ఎప్పుడూ తాగాలి.
  2. అర్ధరాత్రి తినే అలవాటు మానుకోండి: మీకు రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తినే అలవాటు ఉన్నా, అర్ధరాత్రి వేళల్లో తినే అలవాటు ఉన్నా.. దానిని ఈ రోజే వదిలేయండి. ఎందుకంటే మీ ఈ అలవాటు మీ బరువును పెంచడానికి పని చేస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఆహారం తినే అలవాటు మానేయండి. లేకపోతే, మీ బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది.
  3. ఆలస్యంగా మేల్కొనే అలవాటు: బరువు తగ్గడానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం వల్ల బరువు పెరుగుతుంది. కావున బరువు తగ్గాలనుకుంటే, మీరు మంచి నిద్రను కలిగి ఉండాలి. మీరు రాత్రి 10 గంటల కల్లా నిద్రించడానికి ప్రయత్నించాలి.
  4. అధిక కేలరీల ఆహారం తినడం మానుకోండి: రాత్రిపూట అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటే, అది మీ బరువును తగ్గించడంలో ఆటంకాలను కలిగిస్తుంది. ఇంకా బరువు పెరుగుతుంది. అందుకే రాత్రి 7 తర్వాత అధిక క్యాలరీల ఆహారాన్ని తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి మీ బరువును పెంచడానికి పని చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ
ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ
సండే కదా అని చికెన్ తెస్తే ఎంత పనైంది..! కళ్ల ముందే ఘోరం
సండే కదా అని చికెన్ తెస్తే ఎంత పనైంది..! కళ్ల ముందే ఘోరం
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
100ఏళ్ల తర్వాత ధనత్రయోదశి రోజున అరుదైన యాదృచ్చికం ఎలా పూజించాలంటే
100ఏళ్ల తర్వాత ధనత్రయోదశి రోజున అరుదైన యాదృచ్చికం ఎలా పూజించాలంటే
ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..!
ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..!
భవిష్యత్తులో యుద్ధ విమానాలనూ ఎగుమతి చేస్తాం: ప్రధాని మోదీ
భవిష్యత్తులో యుద్ధ విమానాలనూ ఎగుమతి చేస్తాం: ప్రధాని మోదీ
ఎంపీ అంటే ఇలా ఉండాలి.. దెబ్బకు ప్రధాని మోదీయే ఫిదా.!
ఎంపీ అంటే ఇలా ఉండాలి.. దెబ్బకు ప్రధాని మోదీయే ఫిదా.!
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
పంజాబ్‌లో రూ. వంద కోట్ల విలువైన 105 కిలోల హెరాయిన్‌ పట్టివేత
పంజాబ్‌లో రూ. వంద కోట్ల విలువైన 105 కిలోల హెరాయిన్‌ పట్టివేత