Kidney Stone: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీళ్లో రాళ్లు ఉన్నట్లే! ఓ సారి చెక్‌ చేసుకోండి..

|

Aug 23, 2022 | 10:33 AM

కిడ్నీల్లో ఉండే రాళ్ల పరిమాణం పెరిగితే వాటిని తొలగించడానికి అనేక రకాల చికిత్సలు, ఆపరేషన్లు అవసరమవుతాయి. ఐతే మొదట్లోనే ఈ సమస్యను గుర్తిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కింది లక్షణాల ద్వారా కిడ్నీల్లో రాళ్లు..

Kidney Stone: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీళ్లో రాళ్లు ఉన్నట్లే! ఓ సారి చెక్‌ చేసుకోండి..
Kidney Stone
Follow us on

Signs and Symptoms of Kidney Stones: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఇతర శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. ఐతే ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అనేకానేక కిడ్నీ సంబంధిత సమస్యల మూలంగా హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో నేటి కాలంలో కిడ్నీ స్టోన్ లేదా కిడ్నీల్లో రాళ్లు చాలా సాధారణ సమస్యగా పరిణమించింది. కిడ్నీల్లో ఉండే రాళ్ల పరిమాణం పెరిగితే వాటిని తొలగించడానికి అనేక రకాల చికిత్సలు, ఆపరేషన్లు అవసరమవుతాయి. ఐతే మొదట్లోనే ఈ సమస్యను గుర్తిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కింది లక్షణాల ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయో లేదో సులువుగా తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితై శరీరంలో అనేక ఇతర భాగాల్లో నొప్పిని కలిగిస్తాయి. ఈ సమస్యతో బాధపడే వ్యక్తుల్లో సహజంగా వెన్ను, కడుపు నొప్పి ఉంటుంది. సుదీర్ఘకాలంగా వెన్ను నొప్పి, కడుపు నొప్పి వేదిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట వంటి లక్షణాలతో అసౌకర్యంగా అనిపించడం. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌తో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. అలాగే మూత్రంలో రక్తం కనిపించినా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయేమోనని అనుమానించవల్సిందే. దీనిని హెమటూరియా అని కూడా పిలుస్తారు. ఈ రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉండే అవకాశం ఉంది. ఈ విధమైన లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.