AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ.. అవేంటో తెలుసా?

Lifestyle: చాలా మందికి రకరకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఇక చాలా మందిలో ఫైల్స్‌ సమస్య కూడా ఉంటుంది. ఇది కూడా పెద్ద సమస్యే. ముందస్తుగా లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే బాగుంటుందంటున్నారు నిపుణులు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

Lifestyle: ఈ 6 లక్షణాలు ఉంటే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ.. అవేంటో తెలుసా?
Piles
Subhash Goud
|

Updated on: Feb 02, 2026 | 8:24 PM

Share

Lifestyle: చాలా మంది మలబద్ధ పెద్ద సమస్య కాదని భావిస్తారు. ప్రారంభ దశలో మీరు దానిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో మీకు మూలవ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికి మలబద్ధకం రావచ్చు. వారి ఆహారం దానికి ప్రధాన కారణం. దానిని సరిదిద్దకపోయినా ప్రారంభంలోనే మలబద్ధకం గుర్తించకపోతే అది ఫైల్స్‌గా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

మలవిసర్జన సక్రమంగా జరగకపోవడం:

అరుదుగా లేదా ఎక్కువసేపు మలవిసర్జన జరగడం మలబద్ధకం ప్రధాన లక్షణం. వారానికి మూడు లేదా అంతకంటే తక్కువ మలవిసర్జన జరగడం మలబద్ధకానికి సంకేతం. ఇది ఇలాగే కొనసాగితే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. మీకు తరచుగా మలవిసర్జనలు జరుగుతున్నా లేదా ప్రతిరోజూ మలవిసర్జనలు జరిగినా, మీ మలవిసర్జన సులభంగా జరగాలి. కానీ మీ మలవిసర్జన గట్టిగా, పొడిగా మారితే అది మలబద్ధకం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర రూ.2 లక్షలలోపు దిగి రానుందా? నిపుణులు ఏమంటున్నారు?

మలవిసర్జన చేయడంలో ఇబ్బంది:

కాఫీ తాగితేనే మలవిసర్జన చేయగలం. మలవిసర్జన చేసే ముందు వేడినీరు తాగకపోతే అస్సలు మలవిసర్జన చేయలేరు. మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా ఇబ్బంది లేకుండా చేయలేరు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఇది ఖచ్చితంగా మలబద్ధకమేనంటున్నారు నిపుణులు.రోజూ మలవిసర్జన చేసిన తర్వాత కూడా ప్రేగులలో వ్యర్థాలు ఉన్నప్పుడు, అజీర్ణం ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది.

సాధారణంగా మలవిసర్జన తర్వాత కడుపు ఖాళీగా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. కానీ మలబద్ధకం సమస్య ఉంటే మలవిసర్జన తర్వాత కూడా కడుపు బరువుగా అనిపిస్తుంది. అది ఖాళీగా అనిపించదు. అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా జరిగినట్లయితే మీకు ఫైల్స్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: Best Scooters: మహిళలకు అనుకూలంగా ఉండే 5 బెస్ట్‌ స్కూటర్లు ఇవే..!

సాధారణంగా జిడ్డుగల ఆహారాలు తినడం, అతిగా తినడం, జీర్ణం కావడానికి కష్టమైన ఆహారాలు తినడం తర్వాత గుండెల్లో మంట వస్తుంది. కానీ ఈ గుండెల్లో మంట తరచుగా సంభవించడం, ముఖ్యంగా మలవిసర్జన తర్వాత కూడా సమస్య కొనసాగితే అత్యంత తీవ్రమైన లక్షణాలు.

ఇది కూడా చదవండి: EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్త పీఎఫ్‌ రూల్స్‌.. రూ.15,000 నుంచి రూ.25,000కి పెరగనున్న వేతన పరిమితి?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి