Summer Skin Care: ఎండలో బయటకు వెళ్తున్నారా ? చర్మాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి..

|

Apr 21, 2022 | 9:07 PM

ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం అంత సురక్షితం కాదంటున్నారు నిపుణులు. ఇప్పటికే జిల్లాల వారిగా

Summer Skin Care: ఎండలో బయటకు వెళ్తున్నారా ? చర్మాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి..
Summer Skin Care
Follow us on

ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం అంత సురక్షితం కాదంటున్నారు నిపుణులు. ఇప్పటికే జిల్లాల వారిగా హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో వాటర్ బాటిల్ తోపాటు.. కొన్ని పండ్లను వెంట ఉంచుకోవాలి. అయితే వేసవిలో చర్మ సమస్యలు పెరగడం సర్వ సాధారణం. ఎండ తగలకుండా ఉండేందుకు అమ్మాయిలు వీలైనంత వరకు కండువాలు, సన్ గ్లాసెస్ వంటి వాటిని కప్పుకుని నడవడానికి ప్రయత్నిస్తుంటారు. అలెర్జీ.. చర్మం ఎర్రగా మారడం.. మంట, ముఖం పొడిబారడం, వాపు సమస్యలు వేధిస్తుంటాయి. వాతావరణంలో పెరుగుతున్న తేమ చర్మం సహజ గ్లోను తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మర్ సీజన్‌లో బయటకు వెళ్లే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యలను చాలా వరకు దూరం చేసుకోవచ్చు. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.

అలోవెరా జెల్
వేసవి కాలంలో కలబంద చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో చర్మ సంరక్షణలో కలబందను తీసుకుంటే సహజమైన పద్ధతిలో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. బయటకు వెళితే, ముందుగా ముఖానికి అలోవెరా జెల్ రాయాలి. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత అలోవెరా ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాయాలి.. దీనితో మీరు అనేక చర్మ అలెర్జీల సమస్యను నివారించవచ్చు.

పెరుగు
పెరుగుతో కోల్పోయిన తేమను తిరిగి పొందవచ్చు. ఇది టానింగ్‌ను తొలగించడం సహయపడుతుంది. బయటి నుండి వచ్చినప్పుడల్లా ముఖాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత తాజా చల్లటి పెరుగును ముఖం, చేతులకు రాయండి. 30 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

టొమాటో రసం
టొమాటో రసం ముఖ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎండలో వెళ్లడం వల్ల ముఖం లేదా శరీరంపై టానింగ్ వచ్చినట్లయితే టమోటా ప్యాక్ వేసుకోవచ్చు.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె వేడి, సూర్యకాంతి ప్రభావాలను చాలా వరకు తగ్గించడానికి పని చేస్తుంది. దీని స్వభావం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ముఖంలోని మురికిని శుభ్రం చేయడానికి సబ్బుకు బదులు కొబ్బరినూనె వాడితే ముఖం మెరిసిపోతుంది.

రోజ్, దోసకాయ నీరు..
దోసకాయ రసం, రోజ్ వాటర్ కలిపి సన్ టాన్ తొలగించడానికి ఉపయోగించవచ్చు. పత్తి తీసుకుని ముఖంపై రోజ్ వాటర్ అద్దితే టాన్ తొలగిపోతుంది.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందుకు చర్మ నిపుణుల సలహాలు తీసుకోవాలి.

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?