Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitting Posture Tips: కుర్చీలో ఎక్కువసేపు ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా.. ఆ సమస్యకు మీరు దగ్గరగా ఉన్నారని..

Sitting Job Side Effects: ఒకటి రెండు సార్లు మనం ఇష్టమొచ్చినట్లు కూర్చుంటే సరదాగా ఉంటుంది. అలానే.. గంటల తరబడి కుర్చీపై కూర్చొని పని చేస్తున్నవారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ మీరు కుర్చీపై సరిగ్గా కూర్చోకపోతే మీరు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు.. మరి ఎలా కూర్చుంటే మంచిది.. కుర్చీలో ఎంత సమయం కూర్చోవాలి.. కూర్చున్నప్పుడు ఏ పొజిషన్‌లో కూర్చోవాలి.. ఇలాంటి చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..

Sitting Posture Tips: కుర్చీలో ఎక్కువసేపు ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా.. ఆ సమస్యకు మీరు దగ్గరగా ఉన్నారని..
Sitting Posture
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 17, 2023 | 4:41 PM

వర్క్ ఫ్రం హోం చేసినా.. లేదా ఆఫీసులో పని చేస్తున్నా.. పని చేసే వ్యక్తులు చాలా సేపు కంప్యూటర్లకు లేదా ల్యాప్‌టాప్ ముందు కుర్చీలో కూర్చోవలసి ఉంటుంది. ఎలా కూర్చున్నామో కూడా చూసుకోము.. ఒకటి రెండు సార్లు మనం ఇష్టమొచ్చినట్లు కూర్చుంటే సరదాగా ఉంటుంది. అలానే కూర్చుని పని చేస్తే మాత్రం పెద్ద ప్రమాదం రాబోతోందని మాత్రం గుర్తుంచుకోండి. అది మీ నడకను.. ఆ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వారి వెన్నుపాము. మెడ నుంచి ప్రభావితమవుతుంది.

నొప్పితో తట్టుకోలేక పోతున్నానురా బాబోయ్ అంటూ అరిచేవారి సంఖ్యను మనం చాలా సార్లు చూసి ఉంటాం. పని చేసే వ్యక్తులు వారి మొత్తం జీవితంలో 7709 రోజులు కూర్చుని పని చేస్తారు. దీని కారణంగా, చాలా తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మీరు తప్పుగా కుర్చీపై కూర్చుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చో ఈ రోజు మనం తెలుసుకుందాం..

ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేసే వారికి ఈ సమస్యలు..

వెన్నునొప్పి లేదా బ్యాక్ పేయిన్

మీరు కూర్చున్న కూర్చీ మీకు సపోర్టుగా లేకుంటే అది మీ వెన్నుముకపై ప్రభావం చూపిస్తుంది. నెమ్మదిగా వెన్నునొప్పి మొదలవుతంది. ఈ నొప్పి మెడ నుండి మొదలై తోక ఎముక వరకు వెళుతుంది.

ఊబకాయం

అవును, మీరు ఒకే భంగిమలో ఎక్కువసేపు కుర్చీపై కూర్చుని ఎటువంటి కదలికలు లేకుండా గంటలు.. గంటలు అలా పని చేసుకుంటూ పోతే.. మీ శరీరంలోని దిగువ భాగం పెరగడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫ్యాట్ పేరుకుపోతుంది.

ఏకాగ్రత లేకపోవడం

మీరు గంటల తరబడి సరైన పద్దతిలో కుర్చీపై కూర్చోకుండా పని చేస్తే మాత్రం అది మీ ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది. ఎందుకంటే అసౌకర్యంగా కూర్చోవడం.. వ్యక్తి దృష్టి పదేపదే ఒకే చోటికి వెళుతుంది. కాబట్టి మీరు సరైన వీపు, చేయి మద్దతుతో కుర్చీపై కూర్చోవాలి.

భుజం నొప్పి

కుర్చీపై కూర్చొని కంప్యూటర్‌లో పని చేసే వ్యక్తులు కీబోర్డ్‌పై నిరంతరం వేళ్లను కదిలిస్తే.. వారి చేతుల నుంచి భుజాల వరకు నొప్పి  మొదలవుతుంది.

రక్త ప్రసరణ తగ్గడంతో..

గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా కుర్చీపై పనిచేయడం వల్ల భుజం, పొట్ట, నడుము భాగాల్లో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో జలదరింపు లేదా తిమ్మిరి వంటి అసాధారణ సమస్య వస్తాయి.

(నోట్: ఈ వ్యాసంలో పేర్కొన్న పద్ధతులు, సూచనలను అనుసరించే ముందు.. డాక్టర్ లేదా సంబంధిత నిపుణుడి సలహా తీసుకోండి. ఇది మంచి ఆలోచన, ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..