AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బీర్ లవర్స్ ఇది మీ కోసమే.. చల్లటి బీర్లు తెగ తాగేస్తున్నారా.. మీ బాడీ షెడ్డుకే

చలికాలంలో ఐస్ క్రీమ్ తినేవాడు రొమాంటిక్ ఫెలో ఇది ఒక సినిమా డైలాగ్. మరి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం చల్లటి బీర్ తాగేవాడు ఏమవుతాడో ఈ స్టోరీలో చూడండి. ఎండాకాలం వచ్చిందంటే బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఆ వివరాలు ఇలా..

Health Tips: బీర్ లవర్స్ ఇది మీ కోసమే.. చల్లటి బీర్లు తెగ తాగేస్తున్నారా.. మీ బాడీ షెడ్డుకే
Beer
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Apr 28, 2025 | 9:45 PM

Share

చలికాలంలో ఐస్ క్రీమ్ తినేవాడు రొమాంటిక్ ఫెలో ఇది ఒక సినిమా డైలాగ్. మరి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం చల్లటి బీర్ తాగేవాడు ఏమవుతాడో ఈ స్టోరీలో చూడండి. ఎండాకాలం వచ్చిందంటే బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. చల్లటి బీరు నోట్లో పడగానే హుషారు ఎక్కువై టెంపరేచర్లు పడిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలా వేసవికాలంలో బీర్లను మంచినీళ్లలో లేపడం మద్యం ప్రియులకు అలవాటైన పని. ఇక యువతరం గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. చల్లటి బీర్ల కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లి అయిన తెచ్చుకుంటారు. అసలే 40 డిగ్రీలు దాటుతున్న ఈ ఎండల్లో చల్లటి బీరు తాగడం మంచిదేనా.? ఒకవైపు ఎండలు మండిపోతుంటే చల్ల చల్లని బీరును శరీరంలోకి పంపించడం ఎంతవరకు సేఫ్.? టెంపరేచర్లు హెవీగా ఉన్నప్పుడు చల్లని బీర్ తాగడం వల్ల ఆరు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

హీట్ స్ట్రోక్ ప్రమాదం:

మైనస్ డిగ్రీ నుంచి తీసిన బీరుని అప్పటివరకు అధిక ఉష్ణోగ్రతతో ఉన్న మన శరీరంలోకి పంపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోతుంది. ఇది అతి తీవ్రమైన హీట్ స్ట్రోక్ కి దారితీస్తుంది.

డీహైడ్రేషన్:

చల్లటి బీరు తాగుతున్నప్పుడు దాహం తీరినట్లుగా ఉంటుంది. అదే సమయంలో మీ శరీరంలో ఆ చల్లటి బీర్ విపరీతమైన డీహైడ్రేషన్ పెంచుతుంది. దీనివల్ల శరీరంలో నీరు త్వరగా కోల్పోయి మీరు స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.

ఎలక్ట్రోలైట్ ఇన్ బ్యాలెన్స్:

డీహైడ్రేషన్ వల్ల శరీరానికి కావలసిన సోడియం, పొటాషియం లాంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు తక్కువవుతాయి. ఇది కిడ్నీలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం లాంటిది జరుగుతాయి.

బరువు పెరగడం:

కామన్ గానే బీర్లు క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో చల్ల చల్లగా ఉన్నాయని ఎక్కువగా బీర్లు తాగుతూ ఉండడం వల్ల శరీరం బరువు బాగా పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి తగ్గడం:

మామూలుగా ఆల్కహాల్ తో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇక ఎండాకాలంలో వేడి వల్ల శరీరం బలహీనంగా ఉంటుంది అప్పుడు బీర్లు తాగడం వల్ల మరింత నిరోధక శక్తి తగ్గుతుంది.

జీర్ణ సమస్యలు:

అదే పనిగా చల్లటి బీర్లు తాగడం వల్ల యాసిడిటీ, అల్సర్ లాంటి గ్యాస్టిక్ సమస్యలు కచ్చితంగా వస్తాయి.

కొన్ని జాగ్రత్తలు:

చల్లటి బీర్ తాగినప్పుడు అంతకు రెట్టింపు పరిణామములు నీటిని తాగండి. రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువ బీర్లు తాగడం మంచిది. డీహైడ్రేషన్ అనిపిస్తే ఎక్కువగా మంచినీళ్లు, కొబ్బరి నీరు, తేనె, నిమ్మకాయ రసం, పుచ్చకాయలు ఎక్కువగా తీసుకోండి. ఎండలో నిలబడి చల్లని బీరు తాగడం అత్యంత ప్రమాదకరమని గుర్తించండి. బాగా వేడిగా టెంపరేచర్లు ఉంటే అసలు ఆల్కహాల్ ముట్టకపోవడం అత్యుత్తమం.