Ice for Face: అందానికి ఐస్‌ క్యూబ్స్‌.. కూల్‌.. కూల్‌గా.. మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండిలా..!

|

Jan 13, 2025 | 11:47 AM

చాలా మంచి చర్మం అందంగా కనిపించేందుకు ర‌క‌ర‌కాల బ్యూటీ ప్రొడెక్ట్స్ ఉపయోగిస్తుంటారు. కానీ, ఖరీదైన ఉత్పత్తులు మీ చర్మ సౌందర్యాన్ని పాడుచేస్తాయి. కానీ, ఐస్ క్యూబ్స్‌తో అందానికి మెరుగులు పెట్టొచ్చని మీకు తెలుసా..? ఐస్‌తో ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చునని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Ice for Face: అందానికి ఐస్‌ క్యూబ్స్‌.. కూల్‌.. కూల్‌గా.. మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండిలా..!
Ice Cubes
Follow us on

ప్రయాణంతో అలసట, ఒత్తిడి కారణంగా ముఖం అలసటగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తాజాగా కనిపించేందుకు ఐస్ క్యుబ్ తో ముఖంపై స్మూత్‌గా రుద్దుకుంటే అలసట పోతుందని చెబుతున్నారు. ముఖంపై ఐస్‌ను అప్లై చేయడం వల్ల చికాకు, టానింగ్ సమస్య తగ్గుతుంది. సన్‌బర్న్ నుండి ఉపశమనం అందించడానికి పనిచేస్తుంది.

ముఖం మీద ఐస్ మసాజ్ చేయడం వల్ల చర్మం కాలక్రమేణా వృద్ధాప్య సంకేతాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వారానికి రెండు మూడు సార్లు ఐస్‌తో మసాజ్ చేస్తే వృద్ధాప్య లక్షణాలు అదుపులో ఉంటాయి. ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐస్‌ను అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రంగా, మెరిసేలా మరియు మృదువుగా మారుతుంది.

ముఖంపై మొటిమల వ‌ల్ల నొప్పితో చిరాకు పెడుతుంది. అప్పుడు ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని ఉంచి నొప్పి పెడుతున్న భాగంలో అద్దాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. ఐస్ ముక్కల తో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా మెరుస్తుంది. ఐస్‌ను అప్లై చేయడం వల్ల చర్మ కణాలలో ఉండే సెబమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు ఎక్కువగా ఉన్న, చర్మం సాగినట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఐస్‌‌ను ఉంచి మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోయతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. కొందరు ఎక్కువ సమయం పాటు నిద్రపోవటం వల్ల కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలతో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపుతో చక్కగా ఉంటుంది.

మీ చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఐస్ వాడటం మంచిది. దీన్ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల మీ కళ్ల కింద నల్లటి మచ్చలు తగ్గుతాయి. వారానికి రెండు మూడు సార్లు ఐస్‌ని ఉపయోగించడం వల్ల మీ ముఖం మెరుగుపడుతుంది. మొటిమలు, ముడతలు తొలగిపోయి మీరు అందంగా కనిపిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్ కోసం క్లిక్‌ చేయండి..