శీతాకాలంలో చర్మ సమస్యలుఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలోనే మన చర్మ రక్షణకు వివిధ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తీసుకోకపోతే నలుగురిలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎక్కువ చర్మానికి మాయిశ్చరైజర్ వాడుతుంటాం. దీని వల్ల బయటకు వెళ్లినప్పుడు చర్మానికి దుమ్ము అంటుకుంటుంది. అలాగే చర్మం ట్యాన్ అయిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి చర్మానికి బాదం ఆయిల్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని చర్మ సంబంధిత వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్ విటమిన్ – ఈ ఉండే ఉత్పత్తులను వాడడం మంచిది. సో అది ఉత్తమంగా ఉండే ఆల్మండ్ ఆయిల్ ను వాడితే చలికాలంలో చర్మాన్ని అందంగా మార్చడమే కాకుండా ధీర్ఘకాలికంగా ఉండే చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
ముఖానికి తరచూ బాదం నూనె రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు త్వరగా మాయమవుతాయి. బాదం నూనెతో ప్రతిరోజు కళ్ల కింద చేతులతో తేలికగా మసాజ్ చేస్తే కొన్ని వారాల తర్వాత మార్పును గమనించవచ్చు.
బాదం నూనెలో ఉండే విటమిన్ – ఈ కారణంగా చర్మంపై ముడతలు ఈజీగా దూరమవుతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాస్తే ప్రభావవంతమైన ఫలితాలను పొందవచ్చు
ముఖంపై మొటిమల సమస్యతో బాధపడేవారు రోజూ ముఖానికి బాదం నూనెను రాసుకుంటే మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నుంచి బ్యాక్టీరియాను తొలగించడానికి సాయపడుతుంది. అలాగే లోపల నుంచి రంధ్రాలను శుభ్రం చేస్తుంది.
చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల పగుళ్లు వస్తాయి. పగుళ్లు వచ్చిన చోట ఎర్రబడి విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ బాధ నుంచి రక్షణకు బాదం నూనె వాడవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ కరెక్ట్ గా మెయిన్ టెయిన్ అవుతుంది. అలాగే బాదం నూనె వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది.
శీతాకాలంలో ఒక్క చర్మమే కాదు జుట్టు కూడా వివిధ సమస్యలకు గురవుతుంది. అందులో ముఖ్యమైంది చుండ్రు సమస్య. స్కాల్ప్ పై చుండ్రును గమనించిన వెంటనే బాదం నూనెతో వారానికి ఓ సారి మసాజ్ చేస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం