Mens Health: పురుషులకు వరం.. పాలల్లో ఇది కలుపుకొని తాగితే.. ఊహించని రిజల్ట్ ఉంటుందట..! ఆ విషయంలో..

ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పు కారణంగా, పురుషులలో వంధ్యత్వ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా సిగరెట్లు, ఆల్కహాల్, సరైన ఆహారం లేకపోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

Mens Health: పురుషులకు వరం.. పాలల్లో ఇది కలుపుకొని తాగితే.. ఊహించని రిజల్ట్ ఉంటుందట..! ఆ విషయంలో..
Mens Health
Follow us

|

Updated on: Oct 20, 2022 | 2:00 PM

పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే పాలను పూర్తి ఆహారంగా పరిగణిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా కనీసం 1 గ్లాసు పాలు తాగాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే, కొంతమంది పాలను నేరుగా తాగుతారు. మరికొంతమంది పాలు తాగడానికి ఇతర రకాల రుచులు లేదా ఆహార పదార్థాలను జోడిస్తారు. తద్వారా పాల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. చాలా మంది పాలలో బాదం లేదా యాలకులు కలిపి తాగుతారు. అయితే పాలు, లవంగాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పాలు – లవంగాలను కలిపి తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. అలాగే పురుషుల్లో లైంగిక, ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది. 1,2 లవంగాలు, లేదా కొంచెం పొడిని పాలు కలిపి తీసుకోవడం వల్ల పురుషుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషులకు లవంగాలు- పాలు ప్రయోజనాలు

లవంగాలు – పాలు తాగడం ద్వారా పురుషుల స్పెర్మ్ కణాలు చురుకుగా మారుతాయి. మగవారికి లవంగాలు – పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

స్పెర్మ్ కణాలను పెంచుతాయి: ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పు కారణంగా, పురుషులలో వంధ్యత్వ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా సిగరెట్లు, ఆల్కహాల్, సరైన ఆహారం లేకపోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో, లవంగం – పాలు చాలా ఆరోగ్యకరమైనవిగా పేర్కొంటున్నారు. లవంగాలు – పాలు కలిపి తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగడంతోపాటు లైంగిక శక్తి పెరుగుతుంది.

ఒత్తిడి స్థాయి తగ్గుతుంది: రాగి, జింక్, మెగ్నీషియం, పీచు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు లవంగాలలో లభిస్తాయి. అదే సమయంలో, పాలు కాల్షియం – ప్రోటీన్లకు చాలా మంచి మూలం. ఇది పురుషులలో ఒత్తిడి, నిరాశను తగ్గిస్తుంది.

శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది: లవంగాలు – పాలు తీసుకోవడం వల్ల పురుషులలో హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. మీరు మీ శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ 1 గ్లాసు పాలను లవంగాలు కలిపి తాగాలి.

లవంగం – పాలు తాగడం వల్ల కలిగే నష్టాలు..

లవంగాల రుచి చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. దీన్ని ఎక్కువగా తీసుకుంటే అది మీకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా తగ్గిస్తుంది. దీంతోపాటు అల్ప రక్తపోటు, అలర్జీలు, నోటి పుండ్లు, ఉదర సమస్యలు, వేడి లాంటి సమస్యలు పెరుగుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..