AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard Apple: ఆరోగ్యానికి శ్రీరామరక్ష సీతాఫలం.. రోజూ తింటే డబుల్ బెనిఫిట్స్.. కానీ, ఎక్కువైతే..

సీతాఫలాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మితంగా తినడం వల్ల అధిక రక్తపోటు నుంచి జీర్ణక్రియ వరకు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కానీ.. ఎక్కువగా తింటే.. హానికరమని హెచ్చరిస్తున్నారు.

Custard Apple: ఆరోగ్యానికి శ్రీరామరక్ష సీతాఫలం.. రోజూ తింటే డబుల్ బెనిఫిట్స్.. కానీ, ఎక్కువైతే..
Custard Apple
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2022 | 1:55 PM

Share

సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి. శీతాకాంలో లభించే ఈ రుచికరమైన పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. దేశంలోని అన్ని మార్కెట్లలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ పండు సులువుగా దొరుకుతుంది. మామిడిపండ్లు, యాపిల్స్‌లాగా అందరూ సీతాఫలాలను కూడా ఇష్టంగా తింటారు. ఈ పండు అవసరమైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీతాఫలాన్ని మితంగా తినడం వల్ల అధిక రక్తపోటు నుంచి జీర్ణక్రియ వరకు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కానీ ఈ పండును క్రమంగా కాకుండా.. అధికంగా తీసుకుంటే అది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పార్కిన్సన్స్ వంటి వ్యాధిని కూడా ప్రేరేపిస్తుంది. అయితే, ఇది అధిక పరిమాణంలో వినియోగించినప్పుడు మాత్రమే జరుగుతుంది. పరిమిత పరిమాణంలో తీసుకోవడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మానసిక స్థితి మెరుగుపడుతుంది: అక్టోబరు రాగానే చాలా మందిలో మూడ్ సమస్య పెరుగుతుంది. శీతాకాలం ప్రారంభంలో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మీరు కూడా దీని బారిన పడితే వారానికి రెండు మూడు సార్లు సీతాఫలాన్ని తినాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక కప్పు సీతాఫలం తినడం ద్వారా ఒక వ్యక్తిలో 24 శాతం విటమిన్-B6 లభిస్తుంది. ఒక కప్పు సీతాఫలంలో 160 గ్రాముల విటమిన్-బి6 ఉంటుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లు సెరటోనిన్, డోపమైన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని బాగా ఉంచుతుంది.

అనేక వ్యాధుల నుంచి రక్షణ..

సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా మంచి మొత్తంలో ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, కైరోలాయిక్ యాసిడ్, విటమిన్-సి ఉంటాయి. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్‌గా చేస్తుంది. సీతాఫలం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. గుండెను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది..

దీనిలోని పోషకాలు, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు శరీరంపై పనిచేయడమే కాకుండా, అవి శరీరంలోని కొన్ని భాగాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్ లుటీన్ లాగా పనిచేస్తుంది. అందుకే కళ్లకు చూసే సామర్థ్యాన్ని కాపాడుకోవడం అవసరం. శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ పరిమాణం ఎక్కువగా పెరిగినప్పుడు అవి దృష్టిని కూడా దెబ్బతీస్తాయి. దీనితో పాటు, వయస్సు పెరగడం లేదా స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల, దృష్టి కూడా దెబ్బతింటుంది. ఈ పరిస్థితులను నివారించడానికి, లుటీన్ స్థాయిని నిర్వహించడం అవసరం.

అధిక రక్తపోటు నుంచి ఉపశమనం..

ఒత్తిడి, పనిభారంతో నిండిన జీవితంలో అధిక రక్తపోటు ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. అయితే సీతాఫలం వంటి పండ్లను తినడం ద్వారా అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. సీతాఫలంలో చాలా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు సీతాఫలం రోజువారీ అవసరాలలో 10 శాతం పొటాషియం, 6 శాతం మెగ్నీషియంను అందిస్తుంది. పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తికి ప్రతిరోజూ 4,700 mg పొటాషియం అవసరం. కానీ పొటాషియం అవసరాన్ని తీర్చడానికి సీతాఫలాన్ని తినడం మంచిదంటున్నారు. అయితే.. ఎక్కువ తినడం అనర్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పండును రోజుకు ఒకటికి బదులు.. వారానికి 2 నుంచి 3 పండ్లను తింటే మంచిదంటున్నారు.

సీతాఫలాన్ని ఎలా తినాలి..?

సీతాఫలం ఎల్లప్పుడూ పై భాగాన్ని తీసివేసి, గింజలను తీసివేసిన తర్వాత మాత్రమే తినాలి. తినే సందర్భంలో తొక్క, విత్తనాలను పూర్తిగా నివారించాలి. అవి ఆరోగ్యానికి హానికరం. మంచిగా శుభ్రం చేసిన తర్వాత, తొక్క, విత్తనాలను వేరుచేసి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ..