Kitchen Hacks: ఇంట్లోనే సింపుల్ టిప్స్ తో కల్తీ బియ్యాన్ని ఎలా గుర్తించాలంటే

భారతీయులు తినే ఆహారంలో బియ్యం. గోధుమలకు ప్రథమ స్థానం. రోజూ తినే ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. అయితే ప్రస్తుతం మార్కెట్ లో కల్తీ లేని వస్తువులు ఉండడం లేదు కనుక.. బియ్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారని.. ప్లాస్టిక్ తో చేసిన బియ్యం మార్కెట్ లో దొరుకుతుందని వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ఈ కల్తీ బియ్యం తినడం వలన అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు స్వచ్చమైన బియ్యం, కల్తీ బియ్యాన్ని ఇంట్లోనే సింపుల్ టిప్స్ తో ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం..

Kitchen Hacks: ఇంట్లోనే సింపుల్ టిప్స్ తో  కల్తీ బియ్యాన్ని ఎలా గుర్తించాలంటే
Kitchen Hacks

Updated on: Sep 15, 2025 | 2:43 PM

ఏమి కోనేటట్లు లేదు.. ఎం తినేటట్లు లేదు అని ఒక సినీ కవి చెప్పినట్లు.. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఆహార పదార్దాలే కాదు.. వస్తువులు కూడా కల్తీ మయంగా మారిపోయాయి. రకరకాల కారణాలతోనో లేక అధిక సంపాదన మీదమోజుతోనో తినే వస్తువులను కూడా కల్తీ చేస్తున్నారు. అనేక ఆహార పదార్థాలకు రసాయనాలు కూడా కలుపుతున్నారు. ఈ కారణంగా ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. అటువంటి కల్తీ వస్తువుల లిస్టు లో బియ్యం కూడా ఎప్పుడో చేరిపోయాయి. మార్కెట్లో నకిలీ బియ్యం అనే వార్తలు చాలాసార్లు వినిపిస్తున్నాయి. అంటే వరి పంట నుంచి తీయకుండా.. బియ్యాన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారన్నమాట. ఇవి చూడడానికి నిజమైన బియ్యం లాగానే కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. కడుపు సమస్యలు, అలెర్జీలు, తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో తరచుగా ప్లాస్టిక్ బియ్యం మార్కెట్‌లో ఉన్నాయని వార్తలతో నిండిపోతుంది. అయితే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాస్టిక్ బియ్యం మార్కెట్‌లోకి రావడం లేదని స్పష్టం చేసింది. అయితే PUBMED ప్రకారం పచ్చి లేదా వండిన బియ్యంలో పాలీస్టైరిన్ (ఒక రకమైన రసాయనం) ఉండవచ్చు. ఈ రోజు మంచి బియ్యాన్ని, కల్తీ బియ్యాన్ని ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం..

మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం అమ్మకం ప్రారంభమైందనే వార్తల నేపధ్యంలో అనేక రకాల పరిశోధనలు జరిగాయి. అయితే ఇది కేవలం అపోహ అని తేలింది. అయినప్పటికీ బియ్యంలో ప్లాస్టిక్ లాంటి పదార్థాలు కనిపించాయని కొన్ని ప్రయోగశాల పరీక్షలు చెబుతున్నాయి. అంతేకాదు పంట అధిక దిగుబడి కోసం లేదా బియ్యం నిల్వ చేయడానికి యూరియా వంటి అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

నీటితో పరీక్షించండి
ఒక గ్లాసు లేదా లోతైన పాత్రలో నీటితో నింపండి. తరువాత ఆ నీటిలో బియ్యం వేయండి. ఆ నీటిలో బియ్యం తేలుతుంటే.. ఆ బియ్యం కల్తీ కావచ్చు లేదా చెడిపోయి ఉండవచ్చు. అయితే ఈ బియ్యం పూర్తిగా నకిలీవని ఈ పరీక్ష రుజువు కాదు.

బర్న్ టెస్ట్ ప్రయత్నించండి
బియ్యాన్ని చెంచా లేదా స్టీల్ ప్లేట్ మీద వేసి వేడి చేయండి. అప్పుడు దుర్వాసన వచ్చినా లేదా నల్లగా మారినా ఆ బియ్యం కల్తీ అయి ఉండవచ్చు. ఎందుకంటే స్వచ్చమైన బియ్యాన్ని వేయించినప్పుడు అది బంగారు గోధుమ రంగులోకి మారుతుంది. మొదట్లో మంచి వాసన వస్తుంది.. తరువాత అది మాడిన వాసన రావడం ప్రారంభమవుతుంది.

ఉడకబెట్టి పరీక్షించండి
బియ్యాన్ని ఉడకబెట్టడం ద్వారా కూడా పరీక్షించవచ్చు. బియ్యం ఉడకబెట్టిన తర్వాత అన్నం… జిగటగా, రబ్బరు లాగా సాగుతుంటే.. ఆ బియ్యం కల్తీ అయి ఉండవచ్చు. కానీ దీనికి కారణం బియ్యంలో అదనపు స్టార్చ్ ఉండటం. అన్నం రబ్బరులా మారి ఉండ చేసి కొడితే ఎగిరి పడుతుంది.

పఫ్ రైస్‌లో యూరియా
యూరియాను తరచుగా పఫ్డ్ రైస్ లో కలుపుతారు. దీనిని సరళమైన పద్ధతిలో పరీక్షించవచ్చు. ఈ వీడియోలో FSSAI పేర్కొన్న పద్ధతిని ఇంట్లో కూడా సులభంగా ప్రయత్నించవచ్చు. దీనిలో పరీక్ష లిట్మస్ పేపర్‌తో జరిగింది.

ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి వస్తున్నాయని ఖచ్చితంగా చెప్పలేము.. కానీ పాలీస్టైరిన్ తో పాటు అందులో కొన్ని రసాయనాలు కూడా కలపబడి ఉండవచ్చు. ఇవి ఆరోగ్యానికి హానికరం. కనుక ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల నమ్మకమైన ప్రదేశం నుంచి బియ్యాన్ని కొనుగోలు చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)