AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఒకే కాన్పులో నలుగురు చిన్నారులు జననం.. తల్లి పిల్లలు క్షేమం..

కవలలు పుడితేనే తల్లిదండ్రులు మాత్రమే కాదు.. ఆ ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషం. అటువంటిది.. ఒక గర్భిణీ స్త్రీ ఒకే సారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి ఇబ్బంది చెప్పారు. అయితే నలుగురు పిల్లలు కావడంతో కొంచెం బరువు తక్కువగా ఉండడంతో ప్రస్తుతం నవ జాత శిశివులను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పరిశీలన కోసం ఉంచినట్లు చెప్పారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కాగా ఆ తల్లికి ఇది మూడో కాన్పు కావడం విశేషం.

Viral News: ఒకే కాన్పులో నలుగురు చిన్నారులు జననం.. తల్లి పిల్లలు క్షేమం..
Viral News
Surya Kala
|

Updated on: Sep 15, 2025 | 11:34 AM

Share

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళ శనివారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ మహిళకు ఇది మూడో కాన్పు. ఆమెకు మొదటి సారి కవలలు (ఒక అబ్బాయి , ఒక అమ్మాయి జన్మించారు. రెండవ ప్రసవంలో బాలిక జన్మించింది. ఇప్పుడు మూడో సారి ఏకంగా నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఈ పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ శిశువు ఉన్నారు. అయితే ఈ శిశువులు 1200 నుంచి 1600 గ్రాముల మధ్య బరువు కలిగి ఉన్నారు. పిల్లలు తక్కువ బరువు ఉండడంతో.. ప్రస్తుతం వారిని శిశువులను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఉంచారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.

సతరా ఆస్పత్రిలో పురిటినొప్పులతో చేరిన మహిళ ఆరోగ్య తీవ్రత దృష్ట్యా సిజేరియన్‌ చేయాలని వైద్య బృందం నిర్ణయించారు. దీంతో ప్రసూతి విభాగానికి చెందిన డాక్టర్ సదాశివ్ దేశాయ్, డాక్టర్ తుషార్ మస్రామ్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నీలం కదమ్ , డాక్టర్ దీపాలి రాథోడ్ లతో కూడిన వైద్యుల బృందం ఆ మహిళకు ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్య పోయారు.

ఆ మహిళ పూణే జిల్లాలోని సస్వాద్ కు చెందినది. అయితే ఆమె ప్రస్తుతం పని నిమిత్తం సతారాలోని కోరెగావ్ తాలూకాలో నివసిస్తోంది. ఆమెను శుక్రవారం సాయంత్రం సతారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలో.. గైనకాలజీ విభాగానికి చెందిన వైద్యులు ఆమె గర్భంలో నలుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నారు. ఆమె పరిస్థితి తీవ్రం కావడంతో, వైద్యులు వెంటనే సి-సెక్షన్ నిర్వహించారు. ప్రసవం తర్వాత, శిశువులను NICUకి తీసుకెళ్లగా మహిళకు ప్రత్యేక వైద్య సహాయం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తల్లి, నవజాత శిశువులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. పిల్లలు బరువు తక్కువగా ఉండడంతో పరిశీలన కోసం NICUలో ఉంచినట్లు చెప్పారు. అయితే జిల్లా ఆసుపత్రిలో ఇంత అరుదైన ప్రసవం జరగడం ఇదే మొదటిసారి. ఆ మహిళ ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లి.. కాగా ఇప్పుడు మరో నలుగురు పిల్లలకు జన్మ ఇవ్వడంతో ఆమెకు మొత్తం ఇప్పుడు ఏడుగురు సంతానం.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..