Viral Video: బలమైన భూకంపం.. నవజాత శిశువుల రక్షణ కోసం నర్సుల సాహసం..
ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఉదల్గురిలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. భూకంపం సమయంలో నవజాత శిశువుల ప్రాణాలను కాపాడడంలో నాగావ్‌లోని ఒక ఆసుపత్రిలోని నర్సులు ధైర్యం చూపించారు. బలమైన ప్రకంపనలు ఉన్నప్పటికీ.. వారు పిల్లలను సురక్షితంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్ , భూటాన్‌లో కూడా భూకంపం ప్రకంపనలు సంభవించాయి.

ఈశాన్య భారతదేశంలో ఆదివారం సాయంత్రం భూమి అకస్మాత్తుగా కంపించింది. ఉదల్గురి జిల్లాలో 5.8 తీవ్రతతో సంభవించిన భూ కంప తీవ్రత ప్రజలలో భయాందోళనలను కలిగించింది. భూకంపం దాటికి నాగావ్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో కంపించింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న నర్సులు ధైర్యం చూపించి నవజాత శిశువుల ప్రాణాలను కాపాడారు. బలమైన ప్రకంపనల మధ్య కూడా.. నర్సులు చిన్నారులను సురక్షితంగా ఉంచడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. భూకంప ప్రకంపనల మధ్య ప్రతిదీ వణకడం మొదలైనప్పుడు.. నర్సులు తెలివిగా ఆలోచించారు. ముఖ్యంగా నవజాత శిశువుల భద్రతపై దృష్టి పెట్టారు.
భూకంపం సంభవించిన వెంటనే వార్డులో ఉన్న నర్సులు వెంటనే తెలివిని ప్రదర్శించారు. శిశువులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వారున్న ఊయలలను గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఇద్దరు నర్సులు నవజాత శిశువులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏదైనా పరిస్థితి ఎదురైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నర్సుల దైర్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భూకంప కేంద్రం, ప్రభావం నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు భూకంపం ఏర్పడింది. ఈ భూకంప కేంద్రం రాష్ట్రంలో ఉదల్గురి జిల్లాలో భూమికి దాదాపు 5 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రకంపనలు చాలా బలంగా ఉండటంతో ఆసుపత్రులు, ఇళ్ళు , ఆఫీసులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. అయితే ఈ భూకమపం వలన ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వెలుగులోకి రాలేదు.
VIDEO | As an earthquake of 5.8 magnitude shook parts of the northeast region and West Bengal on Sunday, nurses from a hospital in Assam’s Nagaon acted heroically, ensuring the safety of newborns as tremors hit the region.
(Source: Third Party)
(Full video available on PTI… pic.twitter.com/MOFUmU93QY
— Press Trust of India (@PTI_News) September 15, 2025
పశ్చిమ బెంగాల్, భూటాన్ లలో కూడా ప్రకంపనలు అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్, భూటాన్ లలో కూడా భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం ప్రారంభించారు. అయితే ఈ ప్రాంతాల్లో ప్రాణనష్టం , ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేకపోవడం ఉపశమనం కలిగించే విషయం. ఈ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయని.. అందుకే తాము భయపడ్డామని ప్రజలు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
