Kidney Failure Symptoms: మీ కిడ్నీలు పదిలమేనా..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..

సాధారణంగా మూత్రపిండాలు 90 శాతం దెబ్బతినే వరకు లక్షణాలు కనిపించవని నిపుణులు అంటున్నారు. మూత్రపిండాలు అనేక ఆరోగ్య సమస్యలను దాసేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మూత్ర పిండాల వ్యాధితో బాధపడేవారిలో నిశ్శబ్దంగా సమస్య ముదురుతుంది. అందుకే వాటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మూత్రపిండాలను తేలికగా తీసుకోకూడదు. ఇవి శరీర సహజ వడపోత వ్యవస్థలా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు శరీరంలోని హానికరమైన వ్యర్థాలను తొలగిస్తాయి. అందువల్ల వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.

Kidney Failure Symptoms: మీ కిడ్నీలు పదిలమేనా..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..
Kidney Failure Symptoms

Updated on: Feb 19, 2025 | 1:36 PM

శరీరంలోని ప్రతి భాగం కూడా చాలా ముఖ్యమైనదే. ముఖ్యంగా మన ఒంట్లో పిడికిలి పరిమాణంలో ఉండే మూత్రపిండాలు అనేక విధులను నిర్వహించడంలో కీలకంగా ఉంటాయి. ఒంట్లో ఒకసారి మూత్రపిండ వ్యాధి తలెత్తితే అది క్రమంగా తీవ్రమవుతుంది. దాని పనితీరు సామర్థ్యాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన కుటుంబ చరిత్ర కలిగిన వారిలో మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు సర్వసాధారణం. తక్కువ బరువుతో జననం, ఎక్కువ కాలం పాటు తీసుకునే ఏవైనా మందులు తీవ్రమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, మూత్రపిండాల్లో రాళ్లు.. ఇవన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీయవచ్చు. మరి మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మీకెలా ఎలా తెలుస్తుంది? అనే సందేహం కలిగిందా.. ఇదిగో ఈ కింది లక్షణాలను బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు..

మూత్రపిండాల వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం, సకాలంలో వైద్య సంరక్షణ పొందడం ద్వారా వీటిని నివారించవచ్చు. అదుపులోలేని మధుమేహం, అధిక రక్తపోటు మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కాలక్రమేణా మూత్రపిండాల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అదేవిధంగా అదుపు లేని రక్తపోటు రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరును తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..

ఇవి కూడా చదవండి

మూత్రపిండాలు ఫెయిల్ అయితే కనిపించే లక్షణాలు

  • మూత్రపిండాలు ఎక్కువ నీటిని విసర్జించలేనప్పుడు.. విషపదార్ధాలు శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల కాళ్ళు, కళ్ళ చుట్టూ వాపు వస్తుంది.
  • మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు అధిక రక్తపోటు వస్తుంది.
  • మూత్ర విసర్జన చేసేటప్పుడు కొద్దిగా నురుగు రావడం సహజం. కానీ అధిక నురుగు మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనడానికి సంకేతం. ఇది తక్కువ ప్రోటీన్ సూచిక కూడా కావచ్చు.
  • ముదురు, టీ రంగు మూత్రం ప్రమాదకరం. ఇది తీవ్రమైన మూత్రపిండాల దెబ్బతినడాన్ని, మూత్రంలో రక్తం లీకేజీని సూచిస్తుంది.
  • రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం సర్వసాధారణం. కానీ ఇది తరచుగా సంభవిస్తే, అది ముందస్తు మూత్రపిండాల నష్టాన్ని సూచిస్తుంది.
  • రక్తంలో విష స్థాయిలు పెరగడం వల్ల మూత్రపిండాలు పనిచేయకపోవడం జరుగుతుంది. దీని వల్ల కొన్ని రోజుల పాటు వాంతులు అవుతాయి.
  • మూత్రంలో రక్తం కనిపించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.