మల్లె పువ్వు తన సువాసనతో అందరినీ ఆకర్షిస్తుంది. దాని నూనె విషయానికొస్తే, ఇది మల్లెపువ్వు వంటి సువాసనగా ఉంటుంది. ఈ నూనె సుగంధంగా ఉండటమే కాకుండా పుష్కలమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జాస్మిన్ ఆయిల్ జుట్టుకు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ శారీరక సమస్యల నుండి బయటపడటానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. మల్లె నూనెను “క్వీన్ ఆఫ్ ది నైట్” అని పిలుస్తారు. మల్లెపువ్వు మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, మల్లె నూనెను డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి సహజ నివారణగా వాడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కీళ్ల నొప్పులు: చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. దీన్నుంచి విముక్తి పొందాలంటే నిత్యం జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు ఎముకలు, కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
జుట్టు పెరుగుదల: జుట్టు రాలడం లేదా విరిగిపోయే సమస్య ఉన్నట్లయితే, జాస్మిన్ ఆయిల్‌తో మసాజ్ చేయవచ్చు. జాస్మిన్ ఆయిల్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ నూనెను రాసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, నల్లగా, మెరుస్తూ ఉంటుంది. జాస్మిన్ ఆయిల్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.
వాపు: చర్మం వాపు, ఎరుపు లేదా చికాకు సమస్య ఉన్నప్పటికీ జాస్మిన్ ఆయిల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జాస్మిన్ ఆయిల్‌తో మీ చర్మాన్ని క్రమం తప్పకుండా మసాజ్ చేయడం ద్వారా, మీరు ఈ సమస్యలను సులభంగా వదిలించుకోవచ్చు.
అలసట: జాస్మిన్ ఆయిల్‌తో రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల శరీర అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది మరియు మన రక్త ప్రసరణను పెంచుతుంది.
డిప్రెషన్: జాస్మిన్ ఆయిల్ మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజూ ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, కోపం, మతిమరుపు వంటివి దూరమవుతాయి. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల మెదడులో రక్త ప్రసరణ పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..