Jamun: నేరేడు పండ్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఎక్కువగా తింటే అన్నే ఆరోగ్య సమస్యలూ.. అవేంటో తెలుసా!

|

Jul 04, 2021 | 11:55 AM

Jamun Benefits: సమ్మర్ వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు(Jamun) కనిపిస్తాయి. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్న ఈ పండును...

Jamun: నేరేడు పండ్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఎక్కువగా తింటే అన్నే ఆరోగ్య సమస్యలూ.. అవేంటో తెలుసా!
Jamun
Follow us on

సమ్మర్ వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు(Jamun) కనిపిస్తాయి. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్న ఈ పండును తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. క్యాన్సర్, డయాబెటిస్ వంటి రోగాలను దరికి చేరకుండా చేస్తుంది. నేరేడు పండు గుజ్జు, ఆకుల్లోని కెర్నల్ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అందిస్తుంది. దీనిని ఆయుర్వేదం, హోమియోపతిలలో కూడా ఉపయోగిస్తున్నారు. కానీ నేరేడు పండును ఎక్కువగా తినడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

1.రక్తంలో చక్కెర స్తాయిల అసమతుల్యత..

ఆయుర్వేదం ప్రకారం, నేరేడు పండ్లను తినడం ద్వారా అధిక రక్తపోటు కలిగిన రోగులకు ఎంతగానో ప్రయోజనకరం ఉంటుంది. డైట్‌లో నేరేడు పండు లేదా కెర్నల్ పౌడర్‌ను చేర్చడం వల్ల హై-బీపీని సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ వ్యాధిని నియంత్రించేందుకు చాలామంది ఎక్కువ మోతాదులో నేరేడు పండును తీసుకోవడం రక్తపోటులో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

2. మలబద్ధకం..

నేరేడు పండ్లలో విటమిన్-సీ సమృద్దిగా ఉంటుంది. ఈ క్రమంలో నేరేడును అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

3. మొటిమలు..

మీరు నేరేడును ఎక్కువగా తీసుకుంటే.. చర్మ సమస్యలు వస్తాయి. మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

4. వాంతులు సమస్య..

నేరేడు పండ్లను తిన్న తర్వాత చాలా మందికి వాంతులు వస్తాయి. మీకు కూడా ఆ సమస్య ఉంటే, దానిని తినకుండా ఉండటం మంచిది.

Also Read: రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్‌ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి