Beauty Tips: బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా..!

|

Apr 17, 2024 | 10:59 AM

బెల్లం ఒక సహజ ఔషధం. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల సులభంగా మెరిసే చర్మాన్ని పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. మొటిమలను తగ్గించడంలో కూడా అద్భుతంగా తొడ్పడతాయి. కాబట్టి బెల్లం ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలి..? ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Beauty Tips: బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా..!
Beauty Benefits Of Jaggery
Follow us on

బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో అనేక పోషక గుణాలు ఉన్నాయి. రుచికి తియ్యగా ఉండే బెల్లంలో ఐరన్, పొటాషియం, జింక్, కాపర్, ఆరోగ్యానికి అవసరమైన అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. కానీ బెల్లం వాడకం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయని చాలా మందికి తెలియదు. ఇది ముఖం మచ్చలను, వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బెల్లం ఒక సహజ ఔషధం. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల సులభంగా మెరిసే చర్మాన్ని పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. మొటిమలను తగ్గించడంలో కూడా అద్భుతంగా తొడ్పడతాయి. కాబట్టి బెల్లం ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలి..? ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

బెల్లంతో ఫేస్ ప్యాక్‌ తయారీ..

బెల్లంలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా బెల్లం ముఖంపై ముడతలు, గీతలను తగ్గిస్తుంది. చర్మం పొడిబారడం, దురదను కూడా తగ్గిస్తుంది. బెల్లం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బెల్లంతో తయారు చేసిన ఫేస్‌ ప్యాక్ మీ చర్మానికి మేలు చేస్తుంది. దీని కోసం ఒక చెంచా బెల్లం, ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా పాలు కలిపి చక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి.

ఇవి కూడా చదవండి

బెల్లం, తేనె స్క్రబ్‌..

మీరు బెల్లం, తేనెతో స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా బెల్లం, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలిపి స్క్రబ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ స్క్రబ్‌ని మీ ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

బెల్లం, రోజ్ వాటర్

బెల్లం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ చేయడానికి ఒక కప్పు రోజ్ వాటర్‌లో ఒక టీస్పూన్ బెల్లం కలపండి. దానిని కరిగించి నీటిని తయారు చేసుకోవాలి. దానిని స్ప్రే బాటిల్‌లో నింపి మీ ముఖంపై స్ప్రే చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..