AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు టూత్‌పేస్ట్ మింగేస్తున్నారా.. పేరెంట్స్ జాగ్రత్త.. వారి శరీరంలో జరిగేది తెలిస్తే..

మీ పిల్లలు బ్రష్ చేసేటప్పుడు పేస్ట్‌ను మింగేస్తున్నారా..? అయితే ఇది మీకు చేదు వార్తే.. మనం మామూలుగా తీసుకునే ఈ చిన్న విషయం, మీ పిల్లల మేధోశక్తిని తగ్గించడమే కాకుండా.. వారి ఎముకలను కూడా బలహీనపరుస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ షాకింగ్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీ పిల్లలు టూత్‌పేస్ట్ మింగేస్తున్నారా.. పేరెంట్స్ జాగ్రత్త.. వారి శరీరంలో జరిగేది తెలిస్తే..
Is Your Child Eating Toothpaste
Krishna S
|

Updated on: Apr 06, 2026 | 7:59 AM

Share

చిన్న పిల్లలకు బ్రష్ చేయించడం అనేది తల్లులకు ఒక పెద్ద యుద్ధం లాంటిదే. రంగురంగుల ప్యాకింగ్‌లు, తీపి రుచులతో వచ్చే టూత్‌పేస్ట్‌లను చూసి పిల్లలు వాటిని మింగేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఏదో ఒకసారి పొరపాటున మింగితే పర్వాలేదు కానీ ఇది అలవాటుగా మారితే మాత్రం వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టూత్‌పేస్ట్‌లలో దంతాల రక్షణ కోసం వాడే ఫ్లోరైడ్, పరిమితికి మించితే విషతుల్యంగా మారుతుంది. దీర్ఘకాలం పాటు పేస్ట్‌ను మింగే అలవాటు ఉన్న పిల్లల్లో ఈ ఫ్లోరైడ్ ఎముకల్లోనూ శరీరంలోని ఇతర అవయవాల్లోనూ పేరుకుపోతుంది. దీనివల్ల రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

డెంటల్ ఫ్లోరోసిస్: దంతాలపై తెల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, పళ్లు బలహీనపడతాయి.

స్కెలిటల్ ఫ్లోరోసిస్: ఇది మరింత ప్రమాదకరమైనది. ఎముకలు పెళుసుగా మారి, చిన్న దెబ్బలకే విరిగిపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కీళ్ల నొప్పులకు ఇది దారితీస్తుంది.

మేధస్సుపై ప్రభావం

ఇటీవలి పరిశోధనల్లో తేలిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. శరీరంలో ఫ్లోరైడ్ స్థాయిలు అధికమైతే పిల్లల మేధోశక్తి తగ్గే అవకాశం ఉంది. మెదడు ఎదుగుదలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంత వాడాలి..? శాస్త్రవేత్తల సూచనలు

పిల్లలకు బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ పరిమాణం విషయంలో తల్లిదండ్రులు ఈ నియమాలు తప్పక పాటించాలి..

3 ఏళ్లలోపు పిల్లలకు: కేవలం ఒక బియ్యపు గింజంత పరిమాణం మాత్రమే.

3 నుండి 6 ఏళ్ల పిల్లలకు: ఒక బఠాణీ గింజంత మాత్రమే వాడాలి.

మౌత్ ఫ్రెష్‌నర్లు: అత్యవసరమైతే తప్ప చిన్న పిల్లలకు మౌత్ వాష్‌లు లేదా ఫ్రెష్‌నర్లు వాడకపోవడమే మంచిది.

తల్లిదండ్రుల కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలు

ఫ్లోరైడ్ రహిత పేస్ట్లు: చిన్న పిల్లలకు ప్రారంభంలో ఫ్లోరైడ్ ఫ్రీ టూత్‌పేస్ట్‌లను అలవాటు చేయడం ఉత్తమం.

పర్యవేక్షణ: పిల్లలు బ్రష్ చేస్తున్నంత సేపు వారిపై నిఘా ఉంచాలి. పేస్ట్‌ను ఉమ్మివేయడం వారికి నేర్పించాలి.

తియ్యని రుచులకు దూరంగా: మరీ ఎక్కువ తీపి లేదా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్న పేస్ట్‌ల కంటే తక్కువ రుచి ఉన్న వాటిని ఎంచుకుంటే వారు తినడానికి ఇష్టపడరు.

కూర్చుని కాకుండా: పిల్లలకు బ్రష్ చేయించేటప్పుడు వారి తల కొంచెం ముందుకు వంగి ఉండేలా చూస్తే పేస్ట్ లోపలికి వెళ్లే అవకాశం తగ్గుతుంది.

పిల్లల చిరునవ్వు ఎంత ముఖ్యమో, వారి ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. పేస్ట్ రుచిగా ఉందని వారు తింటుంటే ముచ్చటపడకుండా, దానివల్ల కలిగే అనర్థాలను గుర్తించి జాగ్రత్తపడండి.

Follow Us