AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. అసలైన బలం దాంట్లోనే.. చికెన్ లవర్స్‌కు తెలియని నిజాలివే..

ప్రోటీన్ శరీర ఆరోగ్యానికి కీలకమైన పోషకం. కండరాల నిర్మాణం, బరువు నియంత్రణలో దీని పాత్ర అపారం. చికెన్ బ్రెస్ట్ లీన్ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం.. తక్కువ కొవ్వుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. లెగ్ పీస్‌లో కొవ్వు ఎక్కువగా ఉన్నా, ఐరన్ వంటివి ఉంటాయి. మొత్తం మీద, చికెన్ బ్రెస్ట్ లేదా.. లెగ్ పీస్‌.. లో దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Chicken: బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. అసలైన బలం దాంట్లోనే.. చికెన్ లవర్స్‌కు తెలియని నిజాలివే..
Chicken Leg Piece Vs Breast Piece
Shaik Madar Saheb
|

Updated on: May 02, 2026 | 12:35 PM

Share

శరీర ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యంత కీలకమైన పోషకం. కండరాల నిర్మాణం, కణజాల మరమ్మత్తు, ఎంజైములు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ అవసరం. సరైన ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది.. అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అందుకోసమే.. చికెన్ బ్రెస్ట్ వంటి అనిమల్ ప్రోటీన్‌తో పాటు, ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది.. ఇది రోజువారీ అవసరాలకు గణనీయంగా దోహదపడుతుంది. అయితే, ప్రోటీన్‌ను కేవలం అనిమల్ సోర్స్‌ల నుంచే కాకుండా, ప్లాంట్-బేస్డ్ వనరుల నుండి కూడా పొందవచ్చంటున్నారు నిపుణులు.. ఈ అంశంపై పూర్తి అవగాహన కోసం ప్రోటీన్ వనరులు, వాటి వర్గీకరణ గురించి తెలుసుకుందాం.

చికెన్ బ్రెస్ట్ – యానిమల్ ప్రోటీన్:

సాధారణంగా, 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 28 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా మందికి రోజువారీ ప్రోటీన్ అవసరాలలో గణనీయమైన భాగాన్ని తీరుస్తుంది. చికెన్ బ్రెస్ట్ వంటి లీన్ మీట్, గుడ్లు, చేపలు వంటివి పూర్తి అమైనో ఆమ్ల ప్రొఫైల్ కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి చికెన్, గుడ్లు, పెరుగు లేదా చేపలను కలిపి తీసుకోవచ్చు. అయితే, అనిమల్ ప్రోటీన్‌ను మాత్రమే కాకుండా, ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ వనరుల పట్ల కూడా ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఎన్నో ప్రయోజనాలు.. ఆరోగ్యానికి చాలా మంచిది..

అయితే.. చికెన్ బ్రెస్ట్ అధిక నాణ్యత కలిగిన లీన్ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం.. ఇది బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొవ్వు – కేలరీలు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి.. దీనివల్ల ఇది ఫిట్‌నెస్ ప్రేమికులకు, ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఉత్తమమైన ఎంపిక.. అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

చికెన్ బ్రెస్ట్ vs లెగ్‌పీస్

చికెన్ బ్రెస్ట్‌లోని తక్కువ-కొవ్వు ప్రోటీన్ అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందించగలదని.. ఈ ఆహారాన్ని అనేక ఆహార ప్రణాళికలకు సహాయకరంగా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.. అయితే.. చికెన్ బ్రెస్ట్ తో పోలిస్తే.. తొడల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది.. చికెన్ తొడలు – లెగ్ పీస్ఎక్కువ కొవ్వు, కేలరీలు కలిగి ఉన్నప్పటికీ, ఇనుము, జింక్, రుచిని ఎక్కువగా అందిస్తాయని పేర్కొంటున్నారు. ఆరోగ్య పరంగా రెండూ బెస్టే కానీ.. లెగ్ పీస్ కంటే.. బ్రెస్ట్ (రొమ్ము భాగం) మంచిదని పేర్కొంటున్నారు. చికెన్ బ్రెస్ట్‌ను గ్రిల్లింగ్, బేకింగ్ లేదా ఉడకబెట్టడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us