AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటివి పుట్టుకతోనే వస్తాయి.. ఎవరూ సృష్టించలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన రవిబాబు

తెలుగు సినిమా దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా టీవీ 9తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని విషయాలను పంచుకున్నారు.

అలాంటివి పుట్టుకతోనే వస్తాయి.. ఎవరూ సృష్టించలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన రవిబాబు
Ravibabu
Rajeev Rayala
|

Updated on: May 02, 2026 | 12:43 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రవి బాబు, తన సినిమా ప్రయాణం, అలాగే తన సినిమాలు, పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టీవీ9తో జరిగిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిబాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటులు, దర్శకులు, రచయితలు పుట్టుకతోనే వస్తారని, వారి ప్రతిభను ఎవరూ సృష్టించలేరని దాన్ని గట్టిగా నమ్ముతా అని తెలిపారు రవిబాబు. ఇది ఒక గాడ్ గిఫ్ట్ అని ఆయన పేర్కొన్నారు. హారర్ చిత్రాలను ఎక్కువగా మహిళలు ఆదరిస్తారని రవి బాబు తెలిపారు. భయాన్ని కలిగించడంలో నిశ్శబ్దం చాలా గొప్పదని, కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దమే ఎక్కువ భయాన్ని కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హారర్ చిత్రాల నిర్మాణంలో ఒక నిర్దిష్ట సైన్స్ ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

సినిమా అనేది ఒక ఖాళీ కాగితంలాంటిదని, దానిని మ్యాజిక్‌గా మార్చడమే దర్శకుడి పని అని ఆయన తెలిపారు. థియేట్రికల్ అనుభవం యొక్క ప్రాముఖ్యతను రవి బాబు ప్రముఖంగా ప్రస్తావించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కెరీర్‌కు, ఉపాధి అవకాశాలకు అద్భుతంగా తోడ్పడినప్పటికీ, పరిచయం లేని వారితో కలిసి ఒకే ఆడిటోరియంలో సినిమా చూసే థియేట్రికల్ అనుభవం విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని రవిబాబు అన్నారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి కంటెంట్, నటుల నటన, పాత్రల ప్రాముఖ్యతపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

వ్యక్తిగత జీవితంలో, రవి బాబు కఠినమైన క్రమశిక్షణను పాటిస్తా అని తెలిపారు. ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రలేచి, జిమ్‌కు వెళ్లి, సాయంత్రం 4:30 లేదా 5 గంటల కల్లా షూటింగ్‌ను ముగించుకుని ఇంటికి చేరుకుంటా అని తెలిపారు. ఇది గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న దినచర్య అని తెలిపారు. మానసిక దృఢత్వం, క్రమశిక్షణ ఆహారపు కోరికలను అదుపు చేస్తుందని ఆయన అన్నారు. తన కెరీర్‌లో నటుడిగా యావరేజ్ మార్కులతో ఉన్నానని, అయితే దర్శకుడిగా మాత్రం 75 శాతం పైగా మార్కులతో ప్రతిభ కనబరుస్తానని రవిబాబు తెలిపారు. అలాగే కుటుంబానికి తన జీవితంలో 100శాతం  ప్రాధాన్యత ఇస్తానని, కుటుంబమే తనకు సర్వస్వమని రవి బాబు స్పష్టం చేశారు. ఒత్తిడిని స్వీకరించే వ్యాపారంలో తాను లేనని..తన తండ్రి తన జీవితానికి, కెరీర్‌కు గొప్ప ప్రేరణ అని ఆయన పేర్కొన్నారు. మే 8వ తేదీన తన తండ్రి పుట్టినరోజున విడుదలయ్యే తన సినిమా కోసం ఎదురు చూస్తున్నానని, అది ఆయనకు గర్వకారణమవుతుందని భావిస్తున్నానని రవి బాబు తెలిపారు.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us