Food Habits: భోజనం తర్వాత చివర్లో కాస్తంత పెరుగు దట్టించి.. లొట్టలేసుకు తినే వారికి అలర్ట్!
చాలా మందికి భోజనం పూర్తి చేయడానికి పెరుగు ఓ సెంటిమెంట్. అయితే ఇలా భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం శరీరానికి నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా? లేదా? అనే సందేహం ఉంటుంది. అన్నం తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

భోజనం తిన్న తర్వాత చివర్లో కాస్తంత గడ్డ పెరుగు తింటేకానీ కొందరికి తృప్తి కలగదు. ఇది చాలా ఇళ్లల్లో కనిపించే సాధారణ అలవాటు. మరికొందరికి భోజనం పూర్తి చేయడానికి పెరుగు ఓ సెంటిమెంట్. అయితే ఇలా భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం శరీరానికి నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా? లేదా? అనే సందేహం ఉంటుంది. అన్నం తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణక్రియకు మేలు
పెరుగులోని ప్రోబయోటిక్స్ ఏదైనా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి.
వేడి వాతావరణంలో శరీరానికి చల్లదనం
అన్నం తిన్న తర్వాత పుల్లని పెరుగు తినడం వల్ల వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తక్కువగా లేదా నియంత్రణలో ఉంటుంది.
పోషకాలు సమృద్ధి
పెరుగులో కాల్షియం, విటమిన్ బి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఆమ్లతను నియంత్రిస్తుంది
పుల్లని పెరుగు తినడం వల్ల కడుపులోని ఆమ్ల సమతుల్యతను కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు
తక్కువ మొత్తంలో పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
పెరుగు అధికంగా తినడం హానికరం
ఏ ఆహారాన్ని అధికంగా తినడం మంచిది కాదు. కాబట్టి ఇది పెరుగు విషంలోనూ వర్తిస్తుంది. పెరుగును మితంగా తినడం మంచిది. ఎక్కువగా పుల్లని పెరుగు తినడం వల్ల కడుపులో చికాకు, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. రాత్రిపూట అన్నం తిన్న తర్వాత పెరుగు తింటే జలుబు, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
ఆర్థరైటిస్ రోగులకు కూడా పెరుగు యమ డేంజర్
పుల్లని ఆహారాలు వాపును పెంచుతాయి. అందుకే ఆర్థరైటిస్ ఉన్న రోగులు వీలైతే పుల్లని పెరుగుకు దూరంగా ఉండాలి.
విరేచనాలు
ఎక్కువగా పెరుగు తినడం వల్ల ఎవరికైనా జీర్ణ సమస్యలు వస్తాయి. పగటిపూట అన్నం తిన్న తర్వాత కొద్ది మొత్తంలో పెరుగు తినడం శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ రాత్రిపూట తినడం మంచిది కాదు. ఎక్కువ పెరుగు తినకపోవడమే మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








