AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organic Food: ఆర్గానిక్ ఫుడ్స్‌ తినడం ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

ఈ మధ్య కాలంలో జనాల్లో కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. సాధారణంగా దొరికే ఫుడ్స్ కంటే ఆర్గానిక్ ఫుడ్స్ తినేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి..

Organic Food: ఆర్గానిక్ ఫుడ్స్‌ తినడం ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏం అంటున్నారంటే..
Organic Food
Chinni Enni
|

Updated on: Nov 02, 2024 | 12:25 PM

Share

ప్రస్తుత కాలంలో ఆర్గానిక్ ఫుడ్స్‌కి బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కువగా నేచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్ కొనేందుకు.. తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా ఇవి తినేందుకే ఇష్ట పడుతున్నారు. ఆరోగ్యంపై ప్రజలకు బాగా అవాగాహన పెరిగింది. ఈ మధ్య కాలంలో మనకు లభ్యమయ్యే ఆహారాలు ఏది సేఫో చెప్పడం కష్టంగా మారింది. మనం తింటున్నది.. నిజమైన ఆహారమా లేక కల్తీనా అని జనాలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్గానిక్ ఫుడ్స్‌కి బాగా డిమాండ్ పెరిగింది. ఫ్రూట్స్, నిత్యవసర సరుకులు, కూరగాయలు, చికెన్, మటన్ వంటి వాటిని నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి కొనేందుకు ఇష్ట పడుతున్నారు. మరి ఇంతకీ ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా? వీటితో ఉండే ప్రయోజనాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటి..

ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటంటే.. ఎలాంటి క్రిమి సంహారక మందులు, రసాయనాలు వాడకుండా పెంచిన ఉత్పత్తులు. వీటికి కేవలం ఇంట్లో తయారు చేసిన ఎరువులు వంటి వాటినే ఉపయోగిస్తారు. వీటి వలన వచ్చే కాపు, పంట కూడా పూర్తిగా ఎంతో సేఫ్. కానీ ఆర్గానిక్ పద్దతిలో కాకుండా మందులు కొట్టి.. వాడి పెంచిన ఆహారాలు తినడం వల్ల వాటి ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. దీని వలన అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కానీ ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉండదు. కేవలం సహజ సిద్దమై పద్దతుల్లో పెంచినవి కాబట్టి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వాటి వలన పర్యావరణానికి కూడా చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

ఆర్గానిక్ ఫుడ్స్ ప్రయోజనాలు:

ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఆర్గానిక్‌గా తయారు చేసిన ఆహారాల్లో.. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎన్నో లభిస్తాయి. దీని వలన మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. సాధారణంగా మనకు లభించే ఆహార పదార్థాల్లో ప్రిజర్వేటివ్స్, రసాయనాలు వాడతారు. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల సరైన పోషకాలు అందవు. సరిగా కడగకుండా తిన్నా.. వండినా.. క్యాన్సర్, డయాబెటీస్, గుండె సమస్యలు వంటివి రావచ్చు. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ ఎంచుకునే ముందు కూడా జాగ్రత్త వహించాలి. ఇండియా ఆర్గానిక్, యూఎస్‌డీఏ, జైవిక్ భారత్ వంటి ధ్రువీకరణ లేబుల్స్ ఉన్న ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్స్‌లో కూడా కల్తీవి పెట్టి అమ్మేస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.