Rice vs Chapati: అన్నం vs చపాతి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యం..

ప్రస్తుత కాలంలో అన్నం తినడం పూర్తిగా తగ్గించేశారు. చపాతి తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చపాతీలను ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి పెద్దగా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. మరి అన్నం, చపాతి ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..

Rice vs Chapati: అన్నం vs చపాతి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యం..
Rice Vs Chapati
Follow us

|

Updated on: Nov 02, 2024 | 11:48 AM

మనం రోజూ తినే ఆహారాల్లో అన్నం, చపాతీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు వారు ఎక్కువగా బియ్యాన్నే అన్నంగా వండుకుని తింటారు. కానీ ఈ మధ్య కాలంలో అన్నం తినడం వల్ల షుగర్, బీపీ, అధిక బరువు రావడంతో చాలా మంది చపాతి తినడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం రైస్ తింటున్నా.. సాయంత్రం మాత్రం చపాతి తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చపాతీలో క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. వీటి వలన పెద్దగా బరువు పెరగరని అనుకుంటారు. కానీ కొందరు వైద్యులు మాత్రం చపాతి తినడం అంత ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు. మరి ఇంతకీ అన్నం తింటే ఆరోగ్యానికి మంచిదా లేక చపాతీ తింటే మంచిదా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం? నిపుణులు ఏం చెబుతున్నారో.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

చపాతి:

అన్నం కంటే చపాతీలు ఎక్కువగా తినేందుకు ఇష్ట పడటానికి ముఖ్య కారణం ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఎందుకంటే చపాతీల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇంది త్వరగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ కంట్రోల్ అవడానికి, బీపీ పెరగకుండా ఉంటేందుకు, బరువును అదుపులో ఉంచేందుకు చపాతీని తింటూ ఉంటారు. ఎక్కువ సేపు కదలకుండా, శారీరక శ్రమ చేయలేని వారు చపాతీలు తీసుకుంటున్నారు.

అన్నం:

అన్నం తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో అన్నం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అంతే కాకుండా ఇది ఆకలిని కూడా పెంచుతుంది. అన్నంత తినేవారు తక్కువ మొత్తంలో తీసుకుంటే చాలా మంచిది. అన్నం ఎక్కువగా తినడం వల్ల బీపీ, షుగర్, అధిక బరువు, హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్‌ అవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్:

అన్నం, చపాతీ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. కానీ అది మీరు తినే విధానంలో ఉంటుంది. కూరలు బాగున్నాయని అన్నం ఎక్కువగా తింటారు. అలా కాకుండా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే అన్నం ఆరోగ్యానికి మంచిదే. బియ్యం నుంచి కూడా మంచి పోషకాలు అందుతాయి. ఎప్పుడూ వైట్ రైస్ మాత్రమే కాకుండా బ్రౌన్ రైస్, క్వినోవా, ముడి బియ్యం, పాలిష్ చేయని రైస్ తీసుకుంటే బెటర్.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

కిరణ్ అబ్బవరం 'క' దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కిరణ్ అబ్బవరం 'క' దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మీరు వాట్సాప్‌ చాట్‌లో ఈ ట్రిక్‌ని ఉపయోగించారా? అవేంటో తెలుసా..?
మీరు వాట్సాప్‌ చాట్‌లో ఈ ట్రిక్‌ని ఉపయోగించారా? అవేంటో తెలుసా..?
మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు .. భయపెడుతోన్న సలోమి అంచనా
మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు .. భయపెడుతోన్న సలోమి అంచనా
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
అన్నం vs చపాతి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యం..
అన్నం vs చపాతి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యం..
ఇదేం ట్విస్ట్ మావా.! ఈ స్వీట్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
ఇదేం ట్విస్ట్ మావా.! ఈ స్వీట్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
ఆటోలో పాటలు వింటూ పెద్దాయన హుషారు..ఇది కదా జీవితానికి కావాల్సింది
ఆటోలో పాటలు వింటూ పెద్దాయన హుషారు..ఇది కదా జీవితానికి కావాల్సింది
కంగువ ఈవెంట్‌కు రెబల్ స్టార్..
కంగువ ఈవెంట్‌కు రెబల్ స్టార్..
గంటల్లోనే తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
గంటల్లోనే తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
ప్రభుత్వానికి కాసుల పంట.. అక్టోబర్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు!
ప్రభుత్వానికి కాసుల పంట.. అక్టోబర్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు!